`కాస్టింగ్ కౌచ్`పై మమత సంచలన వ్యాఖ్యలు!

0హాలీవుడ్ లో హార్వీ వీన్ స్టీన్ ఉదంతంతో క్యాస్టింగ్ కౌచ్ పై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ లో మొదలైన # మీ టూ ఉద్యమం నుంచి….టాలీవుడ్ లో శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన వరకు క్యాస్టింగ్ కౌచ్ లోని భిన్న పార్శ్వాలను బట్టబయలు చేశాయి. ప్రత్యేకించి శ్రీరెడ్డి ఉదంతం తర్వాత..చాలామంది టాలీవుడ్ – కోలీవుడ్ – బాలీవుడ్ నటీమణులు – హీరోయిన్లు కూడా క్యాస్టింగ్ కౌచ్ పై తమ అభిప్రాయాలను – చేదు అనుభవాలను వెల్లడించేందుకు ముందుకు వస్తున్నారు. దాదాపుగా అన్ని సినీ ఇండస్ట్రీలు…ఆ మాటకొస్తే దాదాపుగా మహిళలు పనిచేసే ప్రతిచోటా…`కాస్టింగ్ కౌచ్` వ్యవహారం ఏదో ఒక రూపంలో వేళ్లూనుకొని పోయింది. ఈ నేపథ్యంలోనే చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ వ్యవహారం గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ మమతా మోహన్ దాస్ …క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక మహిళతో వేరే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటే….అందులో ఆమె ప్రమేయం కూడా ఎంతో కొంత ఉంటుందని మమత షాకింగ్ కామెంట్స్ చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మమత సంచలన వ్యాఖ్యలు చేసింది. క్యాస్టింగ్ కౌచ్ లో కొద్దో గొప్పో మహిళల ప్రమేయం కూడా ఉంటుందని మమత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అందమైన అమ్మాయిలకే ఈ తరహా సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయని మమత చెప్పింది. అందంగా లేని యువతులు సంతోషంగానే ఉంటారని – అందంగా ఉన్న అమ్మాయి సమాజంలో ధైర్యంగా బతకడం కష్టమని మమత చెప్పింది. ఒక మహిళతో పురుషుడు అసభ్యంగా ప్రవర్తిస్తే…..అందుకు ఆమే ప్రేరేపించి ఉంటుందని మమత అభిప్రాయపడింది. అయితే అందరి విషయాల్లోనూ ఇలాగే జరగాలని లేదని – హద్దులు మీరి ప్రవర్తించే కొందరు మహిళలకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పింది. పురుషులు చేసే చిన్న చిన్న కామెంట్లకు అతిగా స్పందించకపోవడమే మంచిదని చెప్పింది. తాజాగా మమత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ మహిళ అయిన మమత ఇతర మహిళల గురించి చులకనగా మాట్లాడడం పై నెటిజన్లు మండిపడుతున్నారు. బలవంతంగా బెదిరించి లైంగిక వేధింపులు – రేప్ లకు పాల్పడే వారి గురించి మమత ఎందుకు మాట్లాడలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.