యాంకరమ్మ వెంట పడ్డ మేనేజర్!

0

అందానికి అందం ట్యాలెంటు ఉంటే టాలీవుడ్ లో దూసుకెళ్లిపోవచ్చు. ఇక్కడ మూవీ ప్రమోషన్స్ కి యాంకర్ల కొరత ఎప్పుడూ ఉంటుంది. ఎంత మంది కొత్త యాంకర్లు వచ్చినా ఇక్కడ పరిపూర్ణమైన ట్యాలెంట్ మాత్రమే నిలబడుతుంది. అలా ఇప్పటికే ఎందరో సీనియర్ యాంకర్లు లాంగ్ టైమ్ లో రాణించారు. వాళ్ల సీజన్ అయిపోయాక కొత్త యాంకర్లు వచ్చి నిరూపించుకుంటూనే ఉన్నారు. అయితే సుమ-ఉదయభాను-ఝాన్సీ- అనసూయ లా లాంగ్ స్టాండింగ్ ఉండే యాంకర్లు అయితే తక్కువే. పట్టుమని పదిమంది యాంకర్ల పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి. ఏడాదికి 200 సినిమాలు రిలీజవుతుంటే వాటి ప్రమోషన్స్ లో చూసే యాంకర్ల ముఖాలు పరిమితమే.

అయితే ఇటీవల కాలంలో అనూహ్యంగా తెరపైకి దూసుకొచ్చిన ఆ క్యూట్ చబ్బీ యాంకర్ మాత్రం కుర్రకారు గుండెల్ని చిదిమేస్తోంది. తనదైన ప్రతిభ.. అందచందాలతో మాయ చేస్తోంది. ఓవైపు టీవీ చానెళ్లలో ఫ్రీల్యాన్స్ యాంకర్ గా దూసుకుపోతూనే మరోవైపు సినీ ఈవెంట్ల ప్రచారంలోనూ నో కాంపిటీషన్ అన్నట్టుగా దూసుకెళుతోంది. ఇటీవలే హై క్లాస్ బెంజి కొన్న ఆ యాంకరమ్మ చాలా మంది యాంకర్లతో పోలిస్తే వేగంగానే కెరీర్ లో ఎదిగింది. ప్రస్తుతం ఈ భామ వెంట కొందరు సినిమా ఛాన్సిస్తాం! అంటూ వెంటపడుతున్నారట.

ఒక ప్రొడక్షన్ మేనేజర్ కం కాస్టింగ్ ఏజెంట్ అయితే ఈ యాక్టర్(యాంకర్ అని తెలియక) ఎవరో వెంటనే నాకు ఫోన్ నంబర్ కావాలని అడిగాడు.. ఆర్టిస్టులు వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు వాయిస్.. అతనొక్కడే కాదు.. ఎందరో మ్యానేజర్లు అంతగా టెంప్ట్ అయిపోతున్నారట. యాంకర్లు హీరోయిన్లుగా రాణిస్తున్నారు కాబట్టి సదరు యాంకర్ నటనలోకి ఎంట్రీ ఇస్తుందా? అన్నది చూడాలి.
Please Read Disclaimer