యాంకర్ ని కమిట్ మెంట్ అడిగి బుక్కయ్యాడా!

0

#మీటూ గగ్గోలు కాస్త తగ్గింది. వెదర్ చల్లబడింది. నటీమణుల నోట కాస్టింగ్ కౌచ్ అన్న మాట ఇటీవల పెద్దంతగా వినిపించడం లేదు. కమిట్ మెంట్లు .. గొడవలు ఏవీ లేక టాలీవుడ్ కాస్త గందరగోళం నుంచి బయటపడుతోంది. అయితే ఈలోగానే ఈ వ్యవహారమేదో తేడాగానే కనిపిస్తోంది. ఉన్నట్టుండి మళ్లీ మీటూ కల్లోలం రాజుకోనుందా? అంటే ఏమో గుర్రం ఎగరనూ వచ్చు! అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే..?

ఇటీవలే ఒక హిట్ అయిన మూవీలో హీరోయిన్ పక్కన చిన్న రోల్ చేసిన ఒక యాంకర్ ని వేరొక ప్రాజెక్ట్ కోసం కమిట్ చేశారు. మూడు రోజుల కాల్షీట్లు చెబితే రెండు రోజులకు పారితోషికం ఇచ్చి మూడో రోజుకి కాంప్రమైజ్ కావాలి అన్నాడట. స్పాట్ లో సదరు యాంకర్ కోప్పడి తిట్టి వచ్చేసింది అని తెలుస్తోంది.

కాస్టింగ్ కౌచ్ చల్లబడింది అనుకుంటుంటే ఈ మేనేజర్ మళ్లీ గిల్లి కజ్జాలు ఓపెన్ గా స్టార్ట్ చేశాడట. ఆ మేనేజర్ గురించి ప్రొడక్షన్ హౌస్ గురించి సదరు యాంకర్ ఇప్పుడు చాలా చోట్ల ఓపెన్ గానే చెబుతోంది. తొందర్లోనే అన్ని వివరాలు ఓపెన్ అవ్వొచ్చు అనే గుసగుసా వినిపిస్తోంది. మొత్తానికి మళ్లీ కమిట్ మెంట్ గోల అగ్గి రాజేస్తుందో ఏమిటో! ఇప్పటికే టాలీవుడ్ పరువు మీటూ వ్యవహారం సహా పలు విషయాల్లో మంట కలిసింది. ఇలాంటిదేదైనా రాజుకుంటే మరోసారి వెదర్ ఒక్కసారిగా వేడెక్కిపోవడం ఖాయం.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-