ఒక్క పుకారుతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన మలయాళ బ్యూటీ

0

టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తేకానీ రాని క్రేజ్ ఈ కేరళ కుట్టికి ఒక్క పుకారుతో వచ్చి పడింది. తెలుగులో ఒక్క సినిమాలో కూడా యాక్ట్ చేయకుండానే యూత్ కి క్రష్ గా మారిపోయింది. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో ఓ మలయాళ బ్యూటీ నటించబోతుందంటూ ఓ న్యూస్ గత కొద్ది రోజులుగా వైరల్ అయింది. పవన్ సరసన మలయాళ బ్యూటీ మానస రాధాకృష్ణన్ నటించే అవకాశాలున్నాయని.. చిత్రబృందం ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే హరీష్ శంకర్ హీరోయిన్ విషయంలో వస్తున్న రూమర్స్ ను పట్టించుకో వద్దని తెలిపాడు. దీంతో కేరళ బ్యూటీ మానస రాధాకృష్ణన్ పవన్ సినిమాలో హీరోయిన్ అనేది పుకారే అని కంఫర్మ్ అయింది. కానీ భామ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉంది. కాగా ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోల పక్కన ఈ మలయాళ బ్యూటీని సెట్ చేసుకుంటే బాగుంటుందని కొంతమంది దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

సినీ ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటుంది. వాళ్లలో కొందరు అందం అభినయంతో గుర్తింపు తెచ్చుకోగా మరికొందరు ఆ ఒక్క సినిమాతోనే సరిపెడుతుంటారు. మన టాలీవుడ్ లో ఓ కొత్త హీరోయిన్ పరిచయం అయితే ఆమె హవా కొన్నాళ్ల పాటు అలా కొనసాగుతూనే ఉంటుంది. లేటెస్ట్ గా కృతి శెట్టి – అమృత అయ్యర్ లు కొన్నాళ్లపాటు హాట్ టాపిక్ గా మారారు. ఇప్పుడు కనీసం ఏ సినిమాకు కూడా సైన్ చెయ్యని మానస రాధాకృష్ణన్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బాలనటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమమైన మానస.. పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాటు ఓ తమిళ సినిమాలోనూ కనిపించింది. అమ్మడుకి అందంతో పాటు అభినయం కూడా ఉందని వీటితో ప్రూవ్ చేసుకుంది. దీనిని బట్టి చూస్తే టాలీవుడ్ లో కూడా పాగా వేసే టాలెంట్ ఉన్నట్లుంది. తెలుగు హీరోలు దర్శక నిర్మాతలు ఎప్పుడు కొత్త హీరోయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి టాలీవుడ్ లో ఈ అమ్మడిని ఇంట్రడ్యూస్ చేస్తారేమో చూడాలి.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home