మేకోవర్ తో షాక్ ఇచ్చిన మంచు హీరో

0

హీరో మంచు మనోజ్ ను వరస పరాజయాలు పలకరించడంతో సినిమాలనుంచి ఒక లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు. మనోజ్ రెగ్యులర్ గా ట్విట్టర్ లో ఏదో ఒక విషయంలో స్పందిస్తూనే ఉన్నప్పటికీ తన ఫోటోలు మాత్రం ఈమధ్య సోషల్ మీడియాలో బయటకు రాలేదు. కొంతకాలం క్రితం తన ఫిజిక్ పై వర్క్ చేస్తున్నట్టుగా మాత్రం ఒక ట్వీట్ పెట్టాడు. అయితే తాజాగా మనోజ్ ట్విట్టర్ లో తన ప్రొఫైల్ పిక్ మార్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు.

గతంలో కాస్త బొద్దుగా ఉన్న మనోజ్ ఈ ఫోటోలో స్లిమ్ గా ఫిట్ గా కనిపిస్తున్నాడు. ఫుల్ ఫోటో కాకపోయినా మనోజ్ ఫేస్ చూస్తేనే ఆ మార్పు తెలుస్తోంది. ‘వేదం’ సినిమా టైమ్ లో పర్ఫెక్ట్ షేప్ లో కనిపించిన మనోజ్ మరోసారి అదే రకంగా మారినట్టు కనిపిస్తున్నాడు. ఈ న్యూ మేకోవర్ మనోజ్ తన కొత్త సినిమాకోసమేనని సమాచారం. త్వరలోనే మనోజ్ కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇది మనోజ్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇక ఈ కొత్త మేకోవర్ కు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. చాలామంది ఈ కొత్త లుక్ తో సర్ ప్రైజ్ చేశావంటూ మనోజ్ ను మెక్చుకుంటున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం మరీ స్లిమ్ లుక్ వద్దని.. కాస్త బొద్దుగా ఉంటేనే బాగుంటావు మనోజ్ అన్నా అని కామెంట్ చేస్తున్నారు. మనోజ్ లాస్ట్ సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. ఈ చిత్రం 2017 లో రిలీజ్ అయింది. రెండేళ్ళ గ్యాప్ తర్వాత మనోజ్ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. మనోజ్ కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని.. ప్రేక్షకులను తనదైన శైలిలో మరోసారి అలరించాలని కోరుకుందాం.
Please Read Disclaimer