బాల‌కృష్ణకి మంచు లక్ష్మి ఛాలెంజ్

0

నటసింహా నందమూరి బాలకృష్ణకు నటి మంచు లక్ష్మి ఛాలెంజ్ విసిరారు. ఆయనతో పాటు తమ్ముడు మంచు మనోజ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా ఈ ఛాలెంజ్‌ను విసిరారు లక్ష్మి. ఇప్పటికే అర్థమైవుంటుంది ఆ ఛాలెంజ్ ఏంటో. అదేనండి.. మొక్కలు నాటే ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు. న‌వంబర్ 13న ప్రముఖ యాంక‌ర్ సుమ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మూడు మొక్కలు నాటారు. అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, మంచు లక్షి, యాంకర్‌ ఓంకార్‌కు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విసిరారు.

సుమ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన మంచువార‌మ్మాయి త‌న ఇంట్లో మొక్క నాటారు. పర్యావరణాన్ని కాపాడే ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో భాగం అయినందుకు సంతోషంగా ఉంద‌ని మంచు ల‌క్ష్మి ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు. ‘‘గ్రీన్ ఛాలెంజ్ చాలా ముఖ్యమైన‌ది. ఎన్ని చెట్లు నాటితే అంత మంచిది. ఇది నిరంత‌రాయంగా కొన‌సాగాలి. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా.. మంచు మ‌నోజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, నంద‌మూరి బాల‌కృష్ణల‌కి ఛాలెంజ్ విసురుతున్నాను’’ అని మంచు ల‌క్ష్మి చెప్పారు.
Please Read Disclaimer