‘వెర్రి నాన్న’.. మంచు లక్ష్మీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

0

డైలాగ్ కింగ్ మోహన్ బాబు మంగళవారం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రజలకు మంచి చేసే వ్యక్తి. ఆయన సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మూడేళ్ల కిందటే జగన్ తనను పార్టీలోకి ఆహ్వానించారని మోహన్ బాబు తెలిపారు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ విషయమై మూడేళ్లుగా చంద్రబాబుకు ఎన్నోసార్లు ఫోన్ చేశానని ఆయన చెప్పారు. మోహన్ బాబుతోపాటు ఆయన కుమారుడు విష్ణు, కుమార్తె లక్ష్మి.. జగన్‌ని లోటస్ పాండ్‌లో కలిసిన సంగతి తెలిసిందే.

మోహన్ బాబు వైఎస్ఆర్సీపీలో చేరడం పట్ల ఆయన కుమార్తె మంచు లక్ష్మీ స్పందించారు. ‘జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు. కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వైఎస్ జగన్’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. దానికి కామెంట్ చేస్తూ.. ‘అండ్ దిస్ జస్ట్ హ్యాపెండ్.. ఆల్ ది వెరీ నాన్నా’ అని ఆమె ట్వీట్ చేశారు.

ఆల్ ది వెరీ బెస్ట్ నాన్నా అనే బదులు తొందర ఆల్ ది వెరీ నాన్న అని లక్ష్మీ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అవును వెర్రీ నాన్నే అని కొందరు కామెంట్లు పెట. మరికొందరేమో బెస్ట్ మిస్సయ్యిందని సూచిస్తున్నారు. వెంటనే అలెర్ట్ అయిన ఆమె.. ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.
Please Read Disclaimer