మంచు లక్ష్మి రాజకీయం.. ఆయన డైరెక్షన్

0

మల్టీ ట్యాలెంట్ అమ్మాయిగా గుర్తింపు దక్కించుకున్న మంచు లక్ష్మి నటిగా ఇప్పటికే నిరూపించుకున్న విషయం తెల్సిందే. నిర్మాతగా హోస్ట్ గా కూడా సత్తా చాటిన మంచు లక్ష్మి ఇప్పుడు మరోసారి నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. మంచు లక్ష్మి ఈసారి సినిమాల ద్వారా కాకుండా ఒక వెబ్ సిరీస్ ద్వారా నటిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు ఈమె నటించిన సినిమాలు అన్ని కూడా చాలా విభిన్నమైనవిగా పేరు దక్కించుకున్నాయి. ఇక ఈమె చేయబోతున్న వెబ్ సిరీస్ కూడా చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

పెళ్లి చూపులు చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు పలు అవార్డులు మరియు రివార్డులు అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మంచు లక్ష్మి వెబ్ సిరీస్ కు ప్లాన్ చేసింది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఆమె స్వయంగా వెబ్ సిరీస్ ను నిర్మించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి.

చాలా కాలం క్రితమే ఒక వెబ్ సిరీస్ ను తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చేయాలని మంచు లక్ష్మి భావించింది. కాని కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెబ్ సిరీస్ కు రంగం సిద్దం అయ్యింది. ఈ వెబ్ సిరీస్ పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కబోతుందట.

ఒక పక్కా ప్రొఫెషనల్ రాజకీయ నాయకురాలి పాత్రలో మంచు లక్ష్మి కనిపించబోతుందని సమాచారం అందుతోంది. ఈ వెబ్ సిరీస్ ను కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లోకి వెళ్లబోతుందని ఆ మద్య మంచు లక్ష్మి గురించి వార్తలు వచ్చాయి. అలా ఏమో కాని వెబ్ సిరీస్ కోసం అయినా రాజకీయాల్లోకి వెళ్లబోతుందన్నమాట.
Please Read Disclaimer