జగన్ బావా.. ఆశ్చర్యపరిచిన మంచు మనోజ్

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన తొలి పుట్టిన రోజును జగన్ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. రాజకీయ నాయకులు అధికారులు స్నేహితులు బంధువుల నుంచి ఆయనకు శుభాకాంక్షల వెల్లువ వచ్చేసింది.

ఇక సీఎం జగన్ కు స్వయాన బంధువు అయిన టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సైతం తాజాగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా అప్యాయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి-విజయమ్మలతో జగన్ కలిసి దిగిన చిన్ననాటి ఫొటోను షేర్ చేస్తూ వినూత్న రితీలో హీరో మంచు మనోష్ విషెస్ చెప్పారు.

మంచు మనోజ్ ఆ అరుదైన చిన్ననాటి ఫోటో షేర్ చేసి ‘దేశంలోనే యువ సీఎం.. నేను ఎంతగానో ప్రేమించే మా బావ వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీ జీవితం సంతోషకరంగా ముందుకు సాగాలి సీఎం గారూ’ అంటూ పోస్ట్ చేశారు. బావా అంటూ అప్యాయంగా జగన్ ను పిలిచిన మంచు మనోజ్ ట్వీట్ వైరల్ గా మారింది. అభిమానులు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

మంచు మనోజ్ వదిన విష్ణు భార్య అయిన విరోనిక స్వయంగా వైఎస్ కుటుంబానికి చెందిన ఆడబిడ్డ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో తమ్ముడు సుధీర్ రెడ్డి కూతురు విరోనిక. జగన్ కు స్వయానా చెల్లెలి వరుస అవుతుంది విరోనిక. ఈ ప్రకారమే జగన్ ను బావా అంటూ అప్యాయంగా పిలిచాడు మంచు మనోజ్.
Please Read Disclaimer