మంచు మనోజ్ ‘వాళ్ల బొంద’ ట్వీట్ వైరల్

0

మంచు మనోజ్ వైవాహిక జీవితం సంబంధించి గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది. మనోజ్ తన భార్యతో కలిసి ఉండటం లేదని.. ఆయన వైవాహిక జీవితంలో సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడని.. కుటుంబ సభ్యులకు కూడా ఆయన దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎక్కువగా చిత్తూరులోనే ఉంటున్నాడనే వార్తలు వచ్చాయి. నిన్న మంచు మనోజ్ ఆ విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. మనోజ్ భార్య ప్రణతి తో విడాకులు తీసుకున్నాడట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెళ్లడించాడు.

గతంలో మంచు మనోజ్ వైవాహిక జీవితం గురించి అనేక వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ‘వాళ్ల బొంద’ అనే ఒకే ఒక్క ట్వీట్ తో తిప్పి కొట్టాడు. ఇద్దరం ఆనందంగా ఉన్నాం.. నేను ప్రణతిని జీవితాంతం ప్రేమిస్తాను అంటూ ట్వీట్ చేశాడు. ఎప్పటికి ఆమె నా గుండెల్లో ఉంటుందని చెప్పిన మంచు మనోజ్ ఆమెకు విడాకులు ఇచ్చినట్లుగా ప్రకటించిన నేపథ్యంలో అప్పటి ట్వీట్ ను ఇప్పుడు జనాలు తెగ రీ ట్వీట్ చేస్తున్నారు.

ఆమె ప్రాణం.. ఎప్పటికి కలిసి ఉంటామని చెప్పిన నువ్వు ఎలా విడాకులు ఇచ్చావంటూ చాలా మంది మంచు మనోజ్ ను ప్రశ్నిస్తున్నారు. ఒక మీడియాలో మనోజ్ విడాకుల గురించి వస్తే వారిని ఉద్దేశించి వాళ్ల బొంద అంటూ ట్వీట్ చేశాడు. ఆ విషయమై కూడా మనోజ్ పై కామెంట్స్ వస్తున్నాయి. విడాకులు తీసుకుని మానసికంగా కృంగిపోయిన మంచు మనోజ్ ను ఇలా పాత విషయాలను రేపి ఇంకా ఆయన్ను బాధ పెట్టడం కరెక్ట్ కాదని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Please Read Disclaimer