మనోజ్ కంబ్యాక్ డైరెక్టర్ ఫిక్స్

0

లఘు చిత్రాలతో నిరూపించుకుంటే ఎంత పెద్ద అవకాశం అయినా తలుపు తడుతుందని ప్రూవైంది. సాహో లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తీసింది ఒక లఘుచిత్రాల దర్శకుడు. యంగ్ ట్యాలెంట్ సుజీత్ లఘు చిత్రాలతో సక్సెసై `రన్ రాజా రన్` తో బ్లాక్ బస్టర్ కొట్టి రెండో ప్రయత్నమే సాహో లాంటి సినిమా తీసే అవకాశం దక్కించుకున్నాడు. అలాగే తరుణ్ భాస్కర్ సైతం లఘు చిత్రాలతో మొదలై పెళ్లి చూపులు లాంటి జాతీయ అవార్డ్ సినిమాని తీశాడు. ఇంతకుముందు బెక్కం వేణు గోపాల్ కాంపౌండ్ లో లఘు చిత్రాల దర్శకుడితో బ్లాక్ బస్టర్లు తీశారు. సురేష్ ప్రొడక్షన్స్.. దిల్ రాజు.. నాని సహా అంతా లఘు చిత్రాల దర్శకులకు అవకాశాలిస్తున్నారు.

మన హీరోలంతా లఘు చిత్రాల తో నిరూపించుకున్న ట్యాలెంటెడ్ దర్శకుల వైపు మొగ్గు చూపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మంచు మనోజ్ కంబ్యాక్ చిత్రానికి ఓ షార్ట్ ఫిలిం డైరెక్టర్ నే ఫిక్స్ చేశారట. ఆయన పేరు శ్రీకాంత్ రెడ్డి. ఓ చక్కని సెటైరికల్ కామెడీ ఎంటర్ టైనర్ కథను రెడీ చేసుకుని మనోజ్ కి వినిపించాడట. ఇందులో లవ్ స్టోరి ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.

ఇంతకు ముందు మనోజ్ సినిమాల్ని విరమించుకున్నానని ప్రకటించి నిర్ణయం మార్చుకున్నాడు. తిరిగి కంబ్యాక్ కోసం ట్రై చేస్తూ ఓ లఘు చిత్రాల దర్శకుడి కి అవకాశం ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో నభా నటేష్ కథానాయికగా నటించనుందని వార్తలు వచ్చినా అధికారికంగా కన్ఫామ్ చేయాల్సి ఉంది. మంచు మనోజ్ ఈ చిత్రాన్ని సొంత నిర్మాణ సంస్థ ఎంఎం ఆర్ట్స్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ సహా ఆర్టిస్టుల ఎంపిక సాగుతోంది.
Please Read Disclaimer