పెట్ డాగ్స్ కి పెళ్లి కుదిర్చారు.. వీళ్లెవరండీ బాబూ!

0

మంచు వారి సరసాలకు మెగా హీరోల సురసురలు తోడైతే ఇంకేమైనా ఉందా? ఇదిగో ఇలా వియ్యంకులే అవుతారు! పైగా పెట్ డాగ్స్ కి పెళ్లి చేసేవరకూ వెళుతోంది సన్నివేశం. ఆ ఇద్దరి స్నేహం ఇప్పుడు వియ్యమొందే వరకూ వెళ్లిందంటే సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

హీరో మంచు మనోజ్ తాజా సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. అక్కడ అతడేం పోస్ట్ చేశాడు? అంటే తన ఫ్రెండు సాయి తేజ్ అతడి పెట్ డాగ్ తో కలిసి తాను తన పెట్ డాగ్ సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటోని షేర్ చేసి దానికి ఆసక్తికర కొటేషన్ ఇచ్చాడు.

“సాంఘిక దూరంతో టాంగో .. జోయాకు డేట్ డే ఇది. ఎంతో ప్రత్యేకమైన రోజు. నాకు మంచి అల్లుడుని ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి ధరమ్ తేజ్ కు థాంక్స్. త్వరలోనే ముహూర్తలు పెట్టించి శుభలేఖలు వెయిస్తాం“ అంటూ సరదా వ్యాఖ్యను జోడించాడు. టాంగో – జోయా జోడీ బాగానే కుదిరింది. ఇక పెళ్లికి మేళాం సిద్ధం చేయడమే ఆలస్యం అన్నట్టుగానే కుదిరింది ఈ ఫోటో కూడా.

పెట్ డాగ్స్ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ ఇద్దరు హీరోల హ్యాబిట్ యానిమల్ లవర్స్ కి విపరీతంగా నచ్చేస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా వైరల్ గా మారింది. మనోజ్ కొంత గ్యాప్ తర్వాత `అహం బ్రహ్మాస్మి` అనే చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు. రెండు వరుస హిట్ల తర్వాత అతడి వియ్యంకుడు క్రేజీగా కెరీర్ ని ప్లాన్ చేశాడు. సోలో బతుకే సో బెటర్ అనే చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నాడు.
Please Read Disclaimer