మంచు పొలిటికల్ రచ్చ..ఆ మాజీ సీఎంపై పంచ్ లే పంచ్ లు

0

రామ్ గోపాల్ వర్మ వరుసగా పొలిటికల్ నేపథ్యంలో సినిమాలు తీస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తర్వాత ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత దానికే సీక్వెల్ కూడా తీస్తానంటూ ప్రకటించాడు. వివాదాలే పాయింట్ గా తీసుకుంటూ వర్మ సినిమాలను చేస్తున్నాడు. వర్మ చేసే ధైర్యం ఎవరు చేయలేక పోతున్నారు అనుకుంటే మంచు హీరో కూడా ఆ సాహసం చేసేందుకు సిద్దం అయ్యాడు. ఒక పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నాడు.

శ్రీకాంత్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్న ఈ వెబ్ సిరీస్ లో ఇద్దరు మాజీ సీఎంలు మరియు ఒక ప్రస్తుత సీఎం గురించి ప్రధానంగా కథ ఉంటుందని సమాచారం అందుతోంది. ఇద్దరు మాజీ సీఎంలలో ఒక మాజీ సీఎంను దేవుడిగా చూపించడంతో పాటు ఒక మాజీ సీఎంను దెయ్యంగా చూపించబోతున్నాడట. అంటే ఒక మాజీ సీఎంపై ఈ సినిమాలో తీవ్రమైన పంచ్ లు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక మాజీ సీఎం గురించిన పలు ఆసక్తికర విషయాలను.. ఆయన బాగోతాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా వెబ్ సిరీస్ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

మంచు మనోజ్ మొదట్లోనే ఈ సినిమా రాజకీయంగా కాస్త కనెక్ట్ అయ్యి ఉంటుందని.. ప్రస్తుత రాజకీయాలకు దగ్గరగా ఉంటుందని చెప్పాడు. కనుక ప్రధానంగా ఈ వెబ్ సిరీస్ ఆ మూడు పాత్రల చుట్టు తిరుగుతాయనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. అతి త్వరలోనే మొదటి పార్ట్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెబ్ సిరీస్ తో పాటు మంచు విష్ణు రెండు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాల ప్రకటన కూడా చేసిన విష్ణు షూటింగ్ అప్ డేట్స్ మాత్రం ఇంకా ఇవ్వలేదు. ప్రస్తుతం పూర్తిగా వెబ్ సిరీస్ నిర్మాణంపైనే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
Please Read Disclaimer