ఫ్యూచర్ ప్లాన్ చెప్పేసిన మనోజ్

0

మంచు మనోజ్ గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా తన డైవోర్స్ విషయం ప్రకటించి చాలామందిని షాక్ కు గురించేశాడు. అయితే తన డైవోర్స్ విషయం వెల్లడించిన రోజే కొత్త జీవితం మొదలుపెడుతున్నాని.. త్వరలో తన కొత్త సినిమా వివరాలు వెల్లడిస్తానని తెలిపాడు. తాజాగా తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు.

ట్విట్టర్ ద్వారా “పండుగ సందర్భం నేను నా కొత్త ప్రొడక్షన్ హౌస్ MM ఆర్ట్స్ ప్రారంభించానని తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ దీపావళి. డీటెయిల్స్ కింద ఉన్నాయి” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో పాటు రెండు ఇమేజెస్ కూడా షేర్ చేశాడు. అందులో ఒకటి ఎంఎం ఆర్ట్స్ లోగో పోస్టర్ కాగా మరో ఇమేజ్ లో ఒక పెద్ద టెక్స్ట్ మెసేజ్ ఉంది. ఈ మెసేజ్ లోనే ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాడు.

“నా సొంత నిర్మాణ సంస్థ MM ఆర్ట్స్ తో నా కొత్త ప్రయాణం మొదలుపెట్టాను. కొత్త టాలెంట్ కు ఔత్సాహికులకు ఈ సంస్థ ద్వారా ఒక మంచి వేదిక కల్పించాలనేది నా ఆలోచన. నా కొత్త సినిమా కూడా ఈ బ్యానర్లోనే తెరకెక్కుతుంది. ఈ అందర్భంగా మీ అందరి ప్రేమ.. దీవెనలు కోరుతున్నాను. ఎంఎం ఆర్ట్స్ ద్వారా ప్రతిభావంతులను కలుసుకునేందుకు ఎదురు చూస్తూ ఉంటాను. మీ కోసం మంచి సినిమాలు తెరకెక్కించాలనేదే నా ఆలోచన. MM ఆర్ట్స్ ద్వారా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రేమతో.. మీ మనోజ్.” బ్యానర్ ప్రకటన కూడా వచ్చేసింది కాబటి త్వరలోనే మనోజ్ కొత్త సినిమా వివరాలు వచ్చే అవకాశం ఉంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home