మంచు విష్ణుతో శ్రీను వైట్ల ఢీ సీక్వెల్?

0

స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల కెరీర్ డైలమా తెలిసిందే. వరుస విజయాల తో ఒకప్పుడు మంచి ఊపు కొనసాగించిన వైట్ల గత నాలుగేళ్లుగా వరుస ఫ్లాప్ ల తో జీరో అయిపోయాడు. తనవైపు వచ్చిన ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చతికిలబడ్డాడు. చివరికి వైవిధ్యమైన కథను ఎంచుకున్నా.. మూస కామెడీతో ఫ్లాపుల్ని ఎదుర్కోవాల్సొచ్చింది. ఏ హీరో అవకాశం ఇచ్చినా శ్రీనూ ఫేట్ మాత్రం మారలేదు. పలువురు అగ్ర హీరోలకు మంచి హిట్లు ఇచ్చిన శ్రీను వైట్ల ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారా లేరా అనే సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి ఏర్పడింది. మహేష్ తో ఆగడు.. రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ ఇవన్నీ అతడికి పెద్దగానే దెబ్బ కొట్టాయి. మాస్ మహారాజా రవితేజ తో మంచి హిట్లు తీసిన శ్రీను వైట్ల అమర్ అక్బన్ ఆంటోనీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం కెరీర్ ని పూర్తిగా జీరో చేసేసింది.

అయితే ఈ మధ్య కాలంలో కొన్ని కథలు రాసుకుని యువ హీరోలతో సినిమాలు చేయాలని వైట్ల ప్రయత్నించారు. చాలా మంది యువ హీరోల ను కలిసి కథలు చెప్పినా.. వైట్లతో సినిమాలు చేయడానికి ఆసక్తిని కనబరచలేదు. అయితే దూకుడుతో మహేష్ కు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన శ్రీను వైట్ల ..ఈ మధ్య ఒక కథ రాసుకుని మళ్లీ మహేష్ ను కలిసే ప్రయత్నం చేశారట. కానీ సూపర్ స్టార్ మహేష్ హిట్ డైరెక్టర్లకు తప్ప వైట్లకు మళ్లీ అవకాశం ఇచ్చే ఛాన్సే లేదన్న టాక్ వినిపించింది.

సరిగ్గా ఇలాంటి టైమ్ లో ఈ ఫ్లాప్ డైరెక్టర్ కి మంచు హీరో రూపంలో మరో అవకాశం దక్కనుందని తెలుస్తోంది. గతంలో వరుస పరాజయాలతో సతమతమైన మంచు విష్ణుకి `ఢీ` లాంటి మంచి హిట్ చిత్రాన్ని అందించారు వైట్ల. ఇది అప్పట్లో బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధించింది. ఈ మధ్య కాలంలోనూ మంచు విష్ణుకి సరైన హిట్లు లేక నైరాశ్యంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో తనకు సూపర్ హిట్ అందించిన శ్రీను వైట్లతో సినిమా చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. బ్లాక్ బస్టర్ మూవీ ఢీ సీక్వెల్ తీస్తామని.. దీనికి సంబంధించిన విషయాలు శ్రీను వైట్ల వెల్లడిస్తారని ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు తెలిపారు. మరి ఈ చిత్రంతోనైనా ఈ ఇద్దరూ తిరిగి దారిన పడతారా? సక్సెస్ దక్కుతుందా? అంటే ఎందుకో సోషల్ మీడియాలో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడెప్పుడో జమానా కాలంలో వర్కవుటైన ఢీ మూవీ సీక్వెల్ తీస్తే నేటి ప్రేక్షకులు ఆదరిస్తారా? పాత మూస కామెడీలను మెచ్చే పరిస్థితి ఇప్పుడు ఉందా? అంటే డౌట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే రొటీనిటీ లేకుండా కొత్తదనం నిండిన కథ.. చక్కని కామెడీ టైమింగ్ తో నేటి యూత్ కి కనెక్టయ్యేలా సినిమాని మలిస్తే ఓ ఛాన్సుంటుందేమో!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-