విష్ణు-విరానిక అండ్ ఫ్యామిలీ.. క్యూట్ పిక్స్

0

టాలీవుడ్ హీరో మంచు విష్ణు పక్కా ఫ్యామిలీ మ్యాన్. మొదటినుంచి విష్ణు తన ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి. అందుకే సమయం దొరికితే చాలు.. తన కుటుంబంతో గడిపుతాడు. మంచు విష్ణు – విరానికను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. విష్ణు – విరానిక దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. అరియానా.. వివియానా అనే కవల అమ్మాయిలు.. అవ్రామ్ భక్త అనే అబ్బాయి ఉన్నాడు. రీసెంట్ గా మంచు ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన క్యూట్ పాప ఐరా విద్య నాలుగవ సంతానం.

తాజాగా మంచు విష్ణు తన సతీమణి విరానిక.. పిల్లలందరితో కలిసి ఒక బ్యూటిఫుల్ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఈ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలలో అందరూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ఒక ఫోటోలో పిల్లలందరూ లవ్ సింబల్ ఉన్న ఫ్లవర్ డిజైన్ పై పడుకుని ఎంతో ముద్దుగా పోజిచ్చారు. ఇంకో ఫోటోలో ఒక చిన్న బెడ్ పై పడుకుని ఉన్న ఐరా విద్యను మిగతా ముగ్గురు పిల్లలు ప్రేమగా చూస్తూ పోజిచ్చారు. మరో ఫోటోలో విష్ణు దంపతులు ఐరాతో పోజివ్వడం విశేషం.

ఈ ఫోటోలు కాకుండా ఐరా విద్య మాత్రమే ఉన్న ఫోటోను విష్ణు తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేశాడు. ఈ ఫోటోకు ‘నా ఐరా విద్య మంచు. పాపకు మీ అందరి ప్రేమ దీవెనలు కావాలి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మంచు లక్ష్మి.. పీవీ సింధు లాంటి చాలామంది సెలబ్రిటీలు లైక్స్ కొట్టారు. ఇక అభిమానులు కూడా పాప క్యూట్ గా ఉందని మెచ్చుకున్నారు. విష్ణు సినిమాల విషయానికి వస్తే చివరి చిత్రం ‘ఓటర్’ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ప్రస్తుతం విష్ణు తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన కథాచర్చల్లో బిజీగా ఉన్నాడని.. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.
Please Read Disclaimer