మంచు ఫ్యామిలీ.. స్వీట్ గా పోజిచ్చారుగా

0

టాలీవుడ్ హీరో మంచు విష్ణు పక్కా ఫ్యామిలీ మ్యాన్ అనే సంగతి తెలిసిందే. ఏమాత్రం సమయం దొరికినా కుటుంబంతో సమయం గడిపేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. లవింగ్ వైఫ్ విరానిక.. పిల్లలు వివియానా.. అవియానా.. అవ్రామ్ భక్తతో సందడి చేస్తుంటాడు. తాజాగా విష్ణు సతీమణి విరానిక తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్ పోస్ట్ చేశారు.

ఈ ఫోటోకు ‘మై ఫ్యామిలీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అందరూ చిరునవ్వులు చిందిస్తూ ఉండడంతో ఫ్యామిలీ పిక్ చాలా క్యూట్ గా ఉంది. అయితే విష్ణు తనయుడు మాత్రం కెమెరాను చూడకుండా పక్కకు చూస్తూ ఉన్నాడు.. అయితే భలే క్యూట్ గా ఉన్నాడు. నాన్న లాంటి డ్రెస్సే వేసుకొని ఎత్తుకోవడంతో మంచు రాజ్యానికి బుల్లి యువరాజులాగా కనిపిస్తున్నాడు. నిజానికి విష్ణు ఫ్యామిలీ పిక్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఎందుకంటే విష్ణు – విరానిక జంటకు త్వరలో తమ నాలుగవ సంతానం రాబోతోంది. అప్పుడే కంప్లీట్ ఫ్యామిలీ పిక్ అవుతుంది.

విష్ణు సినిమాల విషయానికి వస్తే ఈమధ్యే ‘ఓటర్’ విడుదలైంది. కానీ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రస్తుతం విష్ణు ‘కన్నప్ప’ సినిమా కోసం రెడీ అవుతున్నాడని సమాచారం.