మోసగాళ్లు లో మంచు విష్ణు ఫస్ట్ లుక్

0

మంచు విష్ణు కెరీర్ డైలమా గురించి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ యంగ్ హీరో నటించిన సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ఓటర్ రక రకలా వివాదాల నడుమ రిలీజైంది. ఆ తర్వాత విష్ణు నుంచి ఓ హాలీవుడ్ రేంజు సినిమా వస్తోంది అంటూ ప్రచారం వేడెక్కించిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ జీ చిన్ దర్శకత్వం లో ఈ సినిమా మొదలైంది. ఇందులో విష్ణుకి సోదరి గా చందమామ కాజల్ నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా టైటిల్ మోసగాళ్లు.

విష్ణు ఈ చిత్రంలో అర్జున్ అనే పాత్రలో నటిస్తున్నారని రివీల్ చేస్తూ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మోసగాళ్లు అనే స్ట్రైకింగ్ టైటిల్ ని ఎంచుకోవడం ఆసక్తికరం. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ కథతో! అంటూ పోస్టర్ పై ముద్రించడం చూస్తుంటే నిజఘటనల కథతో ఆసక్తికర సినిమాని రూపొందిస్తున్నారని అర్థమవుతోంది. ఈనెల 24న విష్ణు బర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అర్జున్ లుక్ ఆకట్టుకుంది. తెలుగు- ఇంగ్లీష్ సహా పలుభాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. 2020 వేసవిలో రిలీజ్ చేస్తున్నామని చిత్రబృందం వెల్లడించింది.

వరల్డ్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ తో సినిమా అంటే.. కథాంశం ఏమై ఉంటుంది? అన్న ఆసక్తి మొదలైంది. మరి విష్ణు ఎంచుకున్న స్కామ్ ఏమిటి? అన్నది రివీల్ కావాల్సి ఉంది. ఐటీ స్కామ్ అంటే సత్యం కంప్యూటర్స్ కుంభకోణం గురించి తెలుగు ప్రజలకు తెలుసు. బహుశా అలాంటి కథతోనే విష్ణు ప్రయోగం చేస్తున్నాడేమో?
Please Read Disclaimer