మంచు ఇంట శ్రీమంతం వేడుకగా!

0

మంచు విష్ణు- విరోనిక జంట సెలబ్రేషన్స్ గురించి తెలిసిందే. ఇప్పటికే ఈ జంటకు ముగ్గురు సంతానం. ఇప్పుడు నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ హ్యాపీ మూవ్ మెంట్ ని శ్రీమంతం రూపంలో మంచు ఇంట సెలబ్రేషన్ చేసుకోవడం హాట్ టాపిక్. ప్రస్తుతం ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఈవెంట్ ఫోటోల్లో మామ్ విరోనికతో కలిసి తొలి సంతానం వివియానా- అరియానా ట్విన్స్ సందడి చేశారు. వీళ్లతో పాటే కొడుకు అవ్రామ్ కనిపిస్తున్నారు. ఈ ఫోటోల్ని మంచు విష్ణు.. తన సోదరి లక్ష్మీ ప్రసన్న అభిమానులకు షేర్ చేశారు. వేడుకలో క్యూట్ కిడ్స్ ఎంతో ముచ్చటగొలుపుతున్నారు. ట్విన్స్ ఇప్పటికే పెరిగి పెద్దవాళ్లయిపోతున్నారు. శ్రీమంతం వేళ బులుగు జిలుగు సిల్క్ చీరలో విరోనిక ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు.

ఇక విష్ణు కెరీర్ సంగతులు చూస్తే అతడు నటించిన ఓటర్ తొందర్లోనే రిలీజ్ కానుంది. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో నటించనున్నాడని ఇదివరకూ వెల్లడైంది. అధికారికంగా వీటికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer