అయిదు పదుల వయసులోనూ అదే అందాల ఆరబోతా?

0

బాలీవుడ్ హీరోయిన్స్ అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనకాడరు అనే విషయం తెల్సిందే. కాని రెండు మూడు దశాబ్దాల క్రితం హీరోయిన్ గా చేసిన మందీరా బేడీ ఇంకా అందాల ఆరబోయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. మరో రెండు మూడు సంవత్సరాల్లో అయిదు పదుల వయసుకు చేరుకునేందుకు సిద్దంగా ఉన్న మందీరా బేడీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వయసులో కూడా ఈమె తన ఫొటోలతో ఇంకా వైరల్ అవుతుంది అంటే మామూలు విషయం కాదు.

ఇటీవలే సాహో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మందీరా బేడీ ఇంకా వరుసగా చిత్రాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉంది. అతి త్వరలోనే ఈ అమ్మడు మరో సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. ఆ సినిమా కంటే ముందే ఇలా సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను షేర్ చేసింది.

ఈ వయసులో కూడా మొహంలో ఏమాత్రం వర్చస్సు తగ్గలేదు అని.. ఈమె బాడీ షేపింగ్ కూడా ఏమాత్రం చెక్కు చెదరలేదు అంటూ ఈ ఫొటోలకు జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయిదు పదుల వయసుకు వచ్చినా కూడా ఆమె వయసు తెలియని వారికి మూడు పదుల వయసు అంటే నమ్మే విధంగానే ఉందంటూ నెటిజన్స్ అంటున్నారు.
Please Read Disclaimer