‘సాహో’ ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ ట్రీట్

0

బులుగు సముద్రం సిగ్గు పడేలా మందిర ఇస్తున్న ఈ బికినీ ట్రీట్ చూశారా? అసలింతకీ ఈ అమ్మడి వయసెంత? ఆ ప్రశ్న అడక్కూడదంటారా? అయినా తప్పదు. యాభైకి కూతవేటు దూరం(47 వయసు)లో ఉన్న ఈ అమ్మడు ఈ వయసులో ఆ రేంజులో దేహసౌందర్యాన్ని మెయింటెయిన్ చేయడం యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. అయినా వయసుతో పనేం ఉంది మనసుండాలే కానీ..

టీవీ హోస్ట్ గా.. నటిగా మందిర భేడీ జర్నీ గురించి చెప్పాల్సిన పనేలేదు. తాను ఏం చేసినా ప్రపంచం అటువైపు తొంగి చూసింది. అంతగా పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం 2019 మోస్ట్ అవైటెడ్ `సాహో`లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. జాకీ ష్రాఫ్.. నీల్ నితిన్ లాంటి బాలీవుడ్ స్టార్లతో కలిసి ఈ అమ్మడు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతోంది. ఇక సాహో అండర్ ప్రొడక్షన్ ఉండగానే మందిర సోషల్ మీడియా ట్రీట్ విషయంలో జోరు పెంచింది. ఇప్పటికే రెగ్యులర్ గా బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన పోటోల్ని రివీల్ చేస్తోంది.

తాజాగా రిలీజ్ చేసిన ఈ బికినీ బీచ్ ఫోటో ప్రకంపనాలు సృష్టిస్తోంది. బులుగు జిలుగు సముద్రుడు సైతం మందిర టూపీస్ అందానికి ఫిదా అయిపోవాల్సిందే. రెక్కలొచ్చిన బికినీ సుందరిలా అలా గాల్లో తేలిపోవాలని కలలు కంటోంది. మందిర ఏం చేసినా తనిష్టమే. అందుకు అడ్డు చెప్పేదెవరు? `సాహో`కి ట్రీటుంది మరో 30రోజుల్లో. డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీనా?
Please Read Disclaimer