‘రొమాంటిక్’ నుండి ఆమె ఔట్.. కారణం ఏంటో?

0

దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రస్తుతం తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా ‘రొమాంటిక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. అనిల్ పాడూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి మందిరా బేడీ కీలక పాత్రలో ఎంపిక అయిన విషయం తెల్సిందే. ఆమెపై కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారని సమాచారం. ఇప్పుడు ఆమెను సినిమా నుండి తప్పించినట్లుగా టాక్ వినిపిస్తుంది. సినిమాలోని పాత్రకు ఆమె అంతగా సూట్ అవ్వడం లేదనే ఉద్దేశ్యంతో ఆమె స్థానంలో రమ్యకృష్ణ ను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

సాహో చిత్రంలో నటించిన మందీరా బేడీ ఆ సినిమాకు పెద్దగా ప్లస్ అవ్వలేదనే కామెంట్స్ వచ్చాయి. అందుకే ఇప్పుడు రొమాంటిక్ సినిమాకు కూడా ఆమె అవసరం అంతగా లేదనే అభిప్రాయంలో మేకర్స్ ఉన్నారని.. ఆమె పారితోషికం కూడా మరీ ఎక్కువగా ఉందని అందుకే ఆమెను తప్పించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆకాష్ పూరి మొదటి సినిమా మెహబూబా నిరాశ పర్చింది. కనుక ఈ చిత్రంతో అయినా ఆకాష్ కు సూపర్ హిట్ అందించాలని పూరి భావిస్తున్నాడట. అందుకే ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా ప్రయోగాలు చేయకుండా సినిమా చేయాలనుకుంటున్నాడట. అందుకే మందీరా బేడీని తొలగించి ఉంటారనే టాక్ వినిపిస్తుంది.

ఈమద్య కాలంలో రమ్యకృష్ణ టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. బాహుబలి చిత్రం తర్వాత కూడా ఆమె నటించిన పలు సినిమాలతో మెప్పించింది. అందుకే మందీరా బేడీ స్థానంలో ఆమెను తీసుకోవడం వల్ల అన్ని విధాలుగా బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రంను దర్శకుడు అనిల్ రూపొందిస్తున్నాడు. ఆకాష్ పూరికి జోడీగా కేతిక శర్మ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
Please Read Disclaimer