భలే బేటి..భలే భలే డాడీ!

0

మద్యపానం హానికరం అంటారు ఒకరు. తాగితే పోతారు అంటారు మరొకరు. ఎవరు ఎన్ని చెప్పినా మద్యపానం అనేది మన కల్చర్ లో భాగం అయింది. కల్చర్ లో భాగం అంటే అదేదో తప్పుగా అనుకుంటారేమో. ఈమధ్య “రేపులు మన కల్చర్ లో భాగం అయ్యాయని” ఒక బాలీవుడ్ భామ శెలవిచ్చింది. మీరు లిక్కర్ డ్రింకింగ్ కల్చర్ కామెంట్లకే కోప్పడితే ‘అత్యాచారి భారత్’ కామెంట్లకు ఎలా రియాక్ట్ అవుతారో మరి.

ఎలాగూ లిక్కర్ గురించే మాట్లాడుకుంటున్నాం కదా.. ఇదే లిక్కర్ టాపిక్ గురించి వాట్సాప్ లో ఒక మిత్రుడు ఫార్వార్డ్ చేసిన పెద్ద మద్యపాన ప్రవచనం నుంచి మచ్చుకు ఒక డైలాగ్ ఇది – “తాగినోడు ఎదవ కాదు..తాగనోడు పత్తిత్తు కాదు. పోనీ తాగనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే గ్యారంటీ లేదు.” అర్థం అయిందిగా.. మీకు అర్థం అయిందో లేదో కానీ లేటు వయసు బాలీవుడ్ హాటు బ్యూటీ మందిరా బేడీకి ఈ విషయం ఎప్పుడో అర్థం అయింది. అందుకే ఆమె ఈరోజు ఒక కత్తి లాంటి ఫోటో పోస్ట్ చేసింది. మందిరా తన తండ్రిగారు వీరిందర్ సింగ్ బేడి ఒడిలో కూర్చుని ఉన్న ఫోటో అది.

నాన్నగారి చేతిలో ఒక లిక్కర్ గ్లాసు. మందిర చేతిలో మరో లిక్కర్ గ్లాసు. దీనికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ “నాన్న ఒడిలో కూర్చునేందుకు.. ఛీర్స్ చెప్పేందుకు మీకెప్పుడూ వయసు మించిపోయినట్టు కాదు” అంటూ ఒక అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. పెద్దాయన సూపర్ గా ఉన్నారు. మందిరాకే 47 వయసు అయితే మందిరా డాడీగారికి 70 వయసు ఉంటుంది. మరి ఆ వయసులో చీకుచింతా లేకుండా పెగ్గేస్తున్నారంటే.. సూపర్ అనే కదా అర్థం. ఇక ఈ ఫోటోకు రెస్పాన్స్ అదిరిపోయింది. ఇలాంటి ‘పాపా’ మాకు ఉంటే బాగుండేదని మద్యపాన ప్రియులైన నెటిజన్లు నిట్టూర్పులు విడిచారు. మీకు అలాంటి అద్భుతమైన ‘పాపా’ ఉంటే సరే.. లేకపోతే చేసేదేం లేదు.. తూర్పు తిరిగి దణ్ణం పెట్టడమే!
Please Read Disclaimer