మణిరత్నం పాన్ ఇండియా ఇదే

0

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్` ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఎంతో కాలంగా ఈ సినిమా మొదలుపెట్టాలని దర్శకుడు మణిరత్నం ప్రయత్నాలు చేస్తూనే వున్నా ఎందుకనో అంతకంతకు వాయిదా పడుతూనే ఉంది. విజయ్.. మహేష్ .. విక్రమ్ వంటి స్టార్లతో దీన్ని తెరపైకి తీసుకురావాలని మణిరత్నం ప్లాన్ చేశారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత స్టార్లు ఓకే అయినా మొదలుపెట్టాలని ప్రయత్నిస్తే బడ్జెట్కు భయపడి ఫైనాన్సర్లు వెనక్కి తగ్గడంతో ఈ పీరియాడిక్ డ్రామా సెట్స్ కెళుతుందా? అన్న డౌట్ వచ్చింది. చివరికి ఆయన ప్రయత్నాలు ఫలించి లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ముందుకు రావడంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.

దీంతో ఆశలు వదులుకున్న `పొన్నియిన్ సెల్వన్` పట్టాలెక్కింది. ప్రముఖ రచయిత కల్కీ కృష్ణమూర్తి నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని `బాహుబలి` తరహాలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని గురువారం ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఖడ్గాన్ని మాత్రమే వుంచి ఇంగ్లీష్ అక్షరాల్లో టైటిల్ ని వదిలారు.

ఇందులో ఆదిత్య కరికాలన్గా విక్రమ్.. నందినిగా.. మందాకిని దేవిగా ద్విపాత్రాభినయంలో ఐశ్వర్యారాయ్ నటిస్తున్నారు. అరుళ్ మెళివర్మన్గా జయం రవి.. వల్లవరాయ వందియ దేవన్గా కార్తి.. కుందవాయిగా త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు.` `భారీ తెరపై స్వర్ణయుగం ప్రారంభానికి సాక్ష్యంగా నిలవడానికి మీరు సిద్ధంగా వున్నారా?“ అని టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మద్రాస్ టాకీస్ అధికారిక ట్విట్టర్ పేజీ ద్వారా ప్రకటించింది. ఆదుకునే దేవుడు ఎవరైనా ముందుకు రాకపోతాడా అనుకుంటే.. లైకా ప్రొడక్షన్స్ అధినేత అల్లిరాజా సుభాస్కరన్ ఆపద్భాంధవుడిలా ఆదుకుంటున్నారన్నమాట.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-