మణి సార్ కొత్త సినిమా షూట్ ప్రారంభం

0

సీనియర్ ఫిలిం మేకర్ మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ టైటిల్ తో ఒక భారీ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే. భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్ తో.. హిస్టారికల్ ఫిలిం గ ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కునుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.

ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ను నిర్మాతలు థాయ్ ల్యాండ్ లో ప్లాన్ చేశారు. వారం రోజుల క్రితమే మణిరత్నం టీమ్ థాయ్ ల్యాండ్ కు బయలుదేరి వెళ్లిందట. దాదాపు 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని ఈరోజే షూటింగ్ మొదలు పెట్టారని సమాచారం. ఈ సినిమాలో విక్రమ్.. కార్తీ.. జయం రవి.. పార్తిబన్.. జయరాం.. ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పోన్నియన్ సెల్వన్’ అనే తమిళ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిదని మణిసార్ గతంలో వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్. మద్రాస్ టాకీస్.. సన్ పిక్చర్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer