పూరి ఓటు అతనికే !

0

‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ తో మళ్లీ పుంజుకుంటున్నాడు పూరి. సెన్సేషనల్ హీరో విజయ్ తో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఈ సినిమాను కూడా చాలా తక్కువ రోజుల్లోనే పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఈ సినిమాకు ఇంకా టెక్నీషియన్స్ ని ఫైనల్ చేయలేదు. ఎడిటర్ గా జునైద్ ఒక్కడే ప్రస్తుతానికి కన్ఫర్మ్. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చేదెవరనేది మాత్రం అందరిలో మొదలవుతున్న ప్రశ్న.

పూరి -మణిశర్మ లది ఎవరు గ్రీన్ కాంబినేషన్. ఈ కాంబోలో చాలా హిట్స్ వచ్చాయి. అందుకే ‘ఇస్మార్ట్ శంకర్’ కి ఏరి కోరి మరీ మణిను ఎంచుకున్నాడు పూరి. మణి కూడా పూరి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సినిమాకు ఆకట్టుకునే పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతం ఇచ్చాడు. సినిమా విజయంలో మణి ఇచ్చిన సంగీతం కీలక పాత్ర పోషించింది. అందుకే మళ్లీ మణి కే ఓటు వేయనున్నాడట పూరి. విజయ్ కూడా ఈ సినిమా వరకూ మణి శర్మ మ్యూజిక్ అంటేనే ఇష్టపడుతున్నాడట. సో పూరి -మణి కలయికలో విజయ్ కి ఓ మంచి మాస్ ఆల్బమ్ పడటం ఖాయం.

సినిమాలో విజయ్ ఓ మాస్ కుర్రాడిగా కనిపపిస్తాడట. సినిమా మేకింగ్ కంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కె ఎక్కువ సమయం తీసుకునే పూరి ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. ఈ విజయ్ కూడా క్రాంతి సినిమా షూట్ క్లైమాక్స్ తీసుకొచేలా స్పీడప్ చేయనున్నాడని సమాచారం.
Please Read Disclaimer