కథ వినకుండానే నటించేసిందట!

0

మలయాళ సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ ఇటీవల తమిళ ఆడియన్స్ కు ‘అసురన్’ చిత్రంతో పరిచయం అయ్యింది. ధనుష్ హీరోగా వెట్రి మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన అసురన్ చిత్రం గత అక్టోబర్ 4వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రెండవ వారంకు ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరిందని ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కలెక్షన్స్ తో పాటు సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

ధనుష్ పాత్రతో పాటు మంజు వారియర్ పోషించిన పచయమాల్ పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. తమిళ ఆడియన్స్ ప్రియా వారియర్ ను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇతర స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఈమె భవిష్యత్తులో కనిపించే అవకాశం ఉంది. తాజాగా ఈమె ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చి సినిమా విశేషాలను పంచుకుంది.

ఈ సందర్బంగా ప్రియా వారియర్ మాట్లాడుతూ.. సినిమాకు నన్ను సంప్రదించిన సమయంలో కనీసం కథ కూడా అడగకుండా ఓకే చెప్పాను. తప్పకుండా ఇదో మంచి ప్రాజెక్ట్ అవుతుందనే నమ్మకంతో నేను ధనుష్ తో నటించేందుకు ఒప్పుకున్నానంటూ చెప్పుకొచ్చింది. స్క్రిప్ట్ విషయంలో వెట్రి మారన్ మరియు ధనుష్ ల ట్రాక్ రికార్డు తెలుసు కనుక నాకు ఎలాంటి అనుమానం కలగలేదు. సినిమా చేస్తున్న సమయంలోనే తన పాత్ర తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం కలిగిందని ప్రియా వారియర్ చెప్పుకొచ్చింది.