`మన్మధుడు 2` కథ లోగుట్టు ఇదీ

0

కింగ్ నాగార్జున – రకుల్ ప్రీత్ జంటగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న `మన్మధుడు 2` ఆగస్టు 9న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్.. ట్రైలర్ అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. నాగార్జున ఘాటైన రొమాన్స్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక ఈ రొమాన్స్ విషయమై ప్రశ్నిస్తే నాగ్ మీడియా ముందు స్పందించిన తీరు ఆసక్తి కలిగించింది. గీతాంజలిలో రెండున్నర నిమిషాల లిప్ లాక్ ని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆమాత్రం రొమాన్స్ తప్పేమీ కాదని అన్నారు నాగ్. ఇకపోతే మన్మధుడు కథతో `మన్మధుడు 2` కథ కు పోలిక ఉందా? స్ఫూర్తి ఎక్కడి నుంచి? అన్న ప్రశ్నకు.. నాగార్జున తనదైన శైలిలో స్పందించారు.

ఈ సినిమా కాపీ కథతో తెరకెక్కుతోందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైంది. ఫలానా కథ కాపీ కొట్టారంటూ విమర్శలొచ్చాయి. అయితే నేను కాపీ కొట్టే తరహా కాదు. క్రియేటివిటీని కొట్టేయను. ఈ సినిమాకి ఓ ఫ్రెంచ్ సినిమా స్ఫూర్తి. అక్కడి నుంచి థీమ్ తీసుకుని తెరకెక్కించాం. అంతకుముందే రెండు నెలల పాటు ఫ్రెంచి నిర్మాతలతో సంప్రదింపులు సాగించి రీమేక్ హక్కులు కొనుక్కున్నామని నాగార్జున వెల్లడించారు. ఆ ఫ్రెంచి కథలో ఆత్మను తీసుకుని దానిని తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మార్పులు చేశామని తెలిపారు. ఊపిరి చిత్రాన్ని ఫ్రెంచి మూవీ `అన్ టచబుల్స్` రీమేక్ గా తెరకెక్కించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేరొకరి ద్వారా తనకు ఆ ఫ్రెంచి మూవీ కథ గురించి తెలిసిందని.. సినిమా చూడగానే నచ్చి రీమేక్ రైట్స్ తీసుకున్నామని వెల్లడించారు.

మొత్తానికి `మన్మధుడు 2` ఒక రీమేక్ కథతో తెరకెక్కుతోంది అన్న విషయాన్ని టీమ్ ఇప్పటివరకూ రివీల్ చేయనేలేదు. ట్రైలర్ ఈవెంట్లో నాగార్జుననే స్వయంగా రివీల్ చేశారు. కేవలం పుకార్లు.. గాసిప్పులు విన్న తర్వాతనే అసలు గుట్టును విప్పారు ఆయన. 17ఏళ్ల క్రితం వచ్చిన మన్మధుడు చిత్రానికి సీక్వెల్ కథ కాదు ఇది. కేవలం జోనర్ సారూప్యతలు మాత్రమే ఉంటాయి. పూర్తిగా ఇదో కొత్త కథ అని నాగార్జున రివీల్ చేశారు.
Please Read Disclaimer