మన్మథుడు 2 – ట్రైలర్ టాక్

0

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న మన్మథుడు 2 మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందాక దీని ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. కథ విషయానికి వస్తే శామ్(నాగార్జున)వయసు మీద పడుతున్న బ్రహ్మచారిలా బ్రతుకు వెళ్లదీస్తూ ఉంటాడు. అన్ని ఉన్నా మూడు ముళ్ళు అంటే ఆమడదూరం ఉంటూ ఏజ్ బార్ వచ్చేస్తాడు. ఇంత కన్నా ఆలస్యం అవ్వడం చూడలేక తల్లి(లక్ష్మి)పెళ్లి చేయాలని డిసైడ్ అవుతుంది. అప్పుడే తన జీవితంలోకి ఓ మెరుపు తీగ అవంతిక( రకు ల్ ప్రీత్ సింగ్)అడుగు పెడుతుంది.

ఇంట్లో వాళ్ళ పోరు పడలేక ముందు తనతో పరిచయం మొదలుపెడతాడు శామ్. మెల్లగా అది ప్రేమ వైపు దారి తీస్తుంది. ఇంట్లో వాళ్ళు(రావు రమేష్)వెక్కిరిస్తున్నా లెక్క చేయకుండా ముందుకు సాగుతాడు. అయితే అన్ని అనుకున్నట్టుగా సాగవు. పిల్లలు కనడం కోసం నా జీవితం కాదనే సిద్ధాంతాన్ని పెట్టుకుని దాని కోసమే పెళ్ళికి దూరంగా ఉన్న ఈ నవ మన్మథుడి జీవితం చివరికి ఎలాంటి మలుపులు తీసుకుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే

ట్రైలర్ లో అన్ని అంశాలు ఉండేలా చక్కగా కట్ చేశారు. ముఖ్యంగా కామెడీకి పెద్ద పీఠ వేశారు. నాగార్జున కథ ప్రకారం ఏజ్ బార్ బ్యాచిలర్ పాత్ర చేసినప్పటికీ లుక్స్ లో మాత్రం టైటిల్ కు సార్ధకం చేకూరేలా గ్లామర్ తో అదరగొట్టారు. రకుల్ ప్రీత్ సింగ్ పాత్రకు తగ్గట్టు చక్కగా ఉంది. ఓ బేబీతో మురిపించిన లక్ష్మి గారు ఇందులో నాగ్ తల్లిగా మరో ఎమోషనల్ రోల్ చేశారు. రావు రమేష్ టైమింగ్ తో మరోసారి ఆకట్టుకోగా వెన్నెల కిషోర్ కూడా బాగా హెల్ప్ అయ్యాడు.

ఏ కాస్టు అని రావు రమేష్ అనడం దానికి వెన్నెల కిషోర్ బ్రాడ్ కాస్టు అని బదులివ్వడం బాగా పేలింది. ఝాన్సీ ఉనికిని చాటుకుంది.రాహుల్ రవీంద్రన్ టేకింగ్ లో ఫ్రెష్ నెస్ ఉంది. నాగ్ తో మూడు నాలుగు లిప్ లాకులు లాగించేయడం షాక్ ఇచ్చేదే. చేతన్ భరద్వాజ్ సంగీతం ఫీల్ ని క్యారీ చేయగా విదేశాల్లో అధిక భాగం షూటింగ్ జరిగిన రిచ్ నెస్ ఎం సుకుమార్ ఛాయాగ్రహణం ఒడిసిపట్టింది. మన్మథుడు నుంచి ప్రేక్షకులు ఏది ఆశిస్తున్నారో అది ఉందనే హామీ ఇచ్చేలా ట్రైలర్ సాగడం ఫ్యాన్స్ కి కిక్కిచ్చేదేPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home