ఆ టైంలో మూడుసార్లు రిజెక్ట్ అయ్యాను సూసైడ్ ఆలోచన వచ్చింది!!

0

సినీ ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొందరి దృష్టిలో ఆయన దేవుడిగా కనిపించినా ఎక్కువ మందికి మాత్రం వివాదాల వర్మగానే కనిపిస్తాడు. ఆర్జీవి తన సినిమాలతో ఎంతోమందికి లైఫ్ ఇచ్చాడన్న మాట మాత్రం వాస్తవం. ఎంతో మంది ఆర్టిస్టులను ఆయన సినిమాల ద్వారా వెండితెరకు పరిచయం చేసాడు. అలా ఆర్జీవిచే పరిచయమై ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా వెలిగి పోతున్నారు మనోజ్ బాజ్పేయి. ప్రపంచం ఆర్జీవి గురించి ఎలా మాట్లాడుకున్నా ఆయన మాత్రం నా దృష్టి లో గొప్ప వాడే అంటున్నాడు మనోజ్. తాజాగా మనోజ్ ఆయన లైఫ్ లో ఎదుర్కొన్న కష్టాలు.. సినీ ప్రయాణం గురించి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. “నేను బీహార్ లోని చిన్న గ్రామంలో పుట్టి పెరిగాను. మా నాన్న వ్యవసాయం చేసేవారు. ఊరులో ఉన్న చిన్న స్కూల్ లో చదువుకున్నాను.

చిన్నప్పటి నుండి అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం. అలా 9 ఏళ్ల వయస్సు లో యాక్టర్ అవ్వాలని నాలో ఆశ మొదలైంది. అదే నా గమ్యం అని ఫిక్స్ అయ్యా. కానీ అప్పట్లో అది సాధ్యం కాదని తెలిసి చదువుపై దృష్టి పెట్టాను. కానీ యాక్టర్ అవ్వాలనే కోరిక మాత్రం నా మనసులో అలానే ఉండిపోయింది. లాభం లేదని 17వ యేట డీయూను వదిలేసి థియేటర్లో శిక్షణ తీసుకున్నాను. ఈ విషయం మొదట్లో మా ఇంట్లో వాళ్లకు తెలియదు. ఆ తరువాత నేను మా నాన్నకు లెటర్ రాసి అందులో నటన పై శిక్షణ తీసుకుంటున్నట్లు వివరించాను. అందుకు మా నాన్న కోప్పడతారని అనుకున్నా. కానీ ఆయన నాకోసం 200రూపాయల ఫీజును పంపారు. ఇండస్ట్రీ లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేక పోవడం తో సినిమాల్లోకి వచ్చేందుకు చాలా కష్టపడ్డాను. ఇంగ్లీష్ హిందీ బాషలపై పట్టు సాధించి.. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’కు మూడు సార్లు అప్లై చేశాను.

కానీ మూడుసార్లు రిజక్ట్ అవ్వడంతో సూసైడ్ చేసుకుందామనే ఆలోచన కూడా వచ్చింది. ఆ టైం లో నా ఫ్రెండ్స్ నాకు తోడున్నారు. ఎప్పుడు నా పక్కనే ఉంటూ ధైర్యం చెప్పారు. మొదట్లో ఇంటి రెంట్ కూడా కట్టుకోలేకపోయాను. నాలుగు సంవత్సరాల తరువాత మహేష్ భట్ ఓ సిరీస్లో అవకాశం ఇచ్చారు. అక్కడ ఒక్కో ఎపిసోడ్కి రూ.1500 ఇచ్చేవారు. తర్వాత నా టాలెంట్ తో త్వరగానే సినిమా అవకాశాలు దక్కించుకున్నా.. కానీ సత్య సినిమా నాకు బ్రేక్ ఇచ్చింది.(నేషనల్ అవార్డు లభించింది). తర్వాత మెల్లగా సొంత ఇల్లు కొన్నాను. 67 సినిమాల చేసి ప్రస్తుతం ఇలా ఉన్నాను. మనం కన్న కలలు నెరవేరినప్పుడు మనం పడ్డ కష్టం పెద్దగా కనిపించదు” అని మనోజ్ తెలిపారు. మనోజ్ తెలుగు లో హ్యాపీ వేదం కొమరం పులి వంటి సినిమాలు చేశారు.