ఆర్జీవి దొరకడం సినీఇండస్ట్రీకి వరం: మనోజ్ బాజ్ పేయి

0

సినీ ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కొందరి దృష్టిలో ఆయన దేవుడిగా కనిపించినా ఎక్కువమందికి మాత్రం వివాదాల వర్మగానే కనిపిస్తాడు. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ కొన్నేళ్లుగా వరస్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం రూపొందిస్తున్న సినిమాలు అలాంటివి. అయినా సరే రాంగోపాల్ వర్మ అభిమానుల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. ఆర్జీవి తన సినిమాలతో ఎంతోమందికి లైఫ్ ఇచ్చాడన్న మాట మాత్రం వాస్తవం.

ఎంతోమంది ఆర్టిస్టులను ఆయన సినిమాల ద్వారా వెండితెరకు పరిచయం చేసాడు. అలా ఆర్జీవిచే పరిచయమై ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా వెలిగిపోతున్నారు మనోజ్ బాజ్పేయి. ప్రపంచం ఆర్జీవి గురించి ఎలా మాట్లాడుకున్నా ఆయన మాత్రం నా దృష్టిలో గొప్పవాడే అంటున్నాడు మనోజ్. ఈ సందర్బంగా ఆర్జీవి గురించి కొన్ని విషయాలను మనోజ్ చెప్పుకొచ్చాడు. “భారతీయ సినీ చరిత్రలో రాంగోపాల్ వర్మ పేరు కూడా చిరకాలం నిలుస్తుంది. ఎందుకంటే ఆయనలా సినిమాలు ఎవ్వరూ తీయలేరు.

ఇండియన్ సినిమాలకు ఎంతోమంది నటీనటులను దర్శకులను సినీ రచయితలను పరిచయం చేసిన ఘనత ఆర్జీవిది. నాకు సత్య సినిమాలో అవకాశమిచ్చి ప్రోత్సహించాడు. ఆయన వలన గొప్ప స్థాయిని చూసిన వాళ్లలో నేను ఒకడిని. ఆర్జీవి వచ్చాక ఇండియన్ సినిమా స్టైల్ నే మార్చేశాడు. ఆయన స్టైల్ ని ఫాలో అవుతూ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న దర్శక నిర్మాతలు ఎంతోమంది ఉన్నారని చిత్రసీమకు ఆర్జీవి లాంటి వాడు దొరకడం కొత్త ఆర్టిస్టులకు వరం” అంటూ ఆర్జీవి గురించి మనోజ్ తెలిపారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-