అల్లరిగాలికి నాభి అందాలు బైటకు!

0

మానుషి చిల్లర్ పేరు వినే ఉంటారు లెండి. 2017 లో మిస్ ఇండియా.. మిస్ వరల్డ్ కిరీటాలు గెలుచుకున్న భామ. 2018 లో టైమ్స్ వారి మోస్ట్ డిజైరబుల్ వుమన్ అవార్డు కూడా సాధించింది. ఈ భామ కూచిపూడి డ్యాన్సర్ కూడా. త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం కూడా ఖాయమే. దానికి గ్రౌండ్ వర్క్ అన్నట్టుగా ఫేమస్ ‘నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా’ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంది. అయితే సినిమాల్లో నటించి హీరోయిన్ గా మారేలోపు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.

ఈ జెనరేషన్ భామ.. పైగా మిస్ వరల్డ్ కూడా కావడంతో హాటు ఫోటో షూట్స్ లో పాల్గొనడం.. హాటు ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్ట్ చేయడం తనకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా తన ఇన్స్టా ఖాతా నుండి ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “నెక్స్ట్ ఎక్కడికి? #సినమోన్ హోటల్స్ #ఇన్స్ పైరింగ్ మూమెంట్స్ #దిస్ ఈజ్ శ్రీలంక” అంటూ హ్యాష్ టాగ్స్ ఇచ్చింది. అంటే శ్రీలంక ట్రిప్ కు వెళ్ళిందని క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఈ క్యాప్షన్ సంగతేమో కానీ ఫోటో మాత్రం బ్రైట్ గా ఉంది. రెడ్ కలర్ జంప్ సూట్ ధరించి ఒక చార్టర్డ్ ఫ్లైట్ దిగుతూ పోజిచ్చింది.. ఫోటోలో ఏమాత్రం ఎక్స్ పోజింగ్ లేదు.. స్కిన్ షో లేదు. చిలిపిదనం కరెక్ట్ టైమింగ్ తో ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ దో లేక అల్లరిగాలిదో ఏమో కానీ కరెక్ట్ గా నాభి అందాలు మాత్రం బహిర్గతం అయ్యాయి.. అదే ఈ ఫోటోలో హైలైట్.

కళ్ళకు గాగుల్స్.. కాళ్ళకేమో హై హీల్స్.. ఆ ఎర్రటి డ్రెస్సు.. నిజంగా అదిరిపోయింది. ఈ ఫోటోను పోస్ట్ చేసి జస్ట్ 15 మినిట్స్ అయింది.. అయితే అంతలోనే పాతిక వేల లైక్స్.. వంద కామెంట్లు. నెటిజన్లు అంత యాక్టివ్ గా ఉన్నారు మరి. “క్లాసీ అండ్ ఫ్యాబ్యులస్”.. “కార్పోరేట్ బాస్ లాగా ఉన్నావు”…”నువ్వు రియల్ మిస్ వరల్డ్” అంటూ కామెంట్లు పెట్టారు. ఈ పాప సినిమాల్లోకి రాకముందే ఇలా ఉంటే వచ్చిన తర్వాత ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుందేమో!
Please Read Disclaimer