జక్కన్న చూపిన దారిలోనే రాజాగారి బయోపిక్!

0

పద్మావత్ .. సైరా .. పానిపట్ .. ఇవన్నీ రాజుల కథతో తెరకెక్కిన హిస్టారికల్ పాన్ ఇండియా చిత్రాలు. భన్సాలీ తెరకెక్కించిన కళాఖండం భాజీరావ్ మస్తానీ ఈ కోవకే చెందుతుంది. రాజులు .. రాణులు.. రాజ్యాలు.. ప్రాకారాలు.. సైన్యం.. యుద్ధాలు.. ఒకటేమిటి భీకరమైన ఎమోషన్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే విషయం ఉంటుంది వీటిలో. ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్లకు ఏమాత్రం వెరవక పలువురు దర్శకులు హిస్టారికల్ కథల్ని ఎంచుకుని ప్రయోగాలు చేస్తున్నారు. మహారాజుల కథల్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఒక రకంగా జక్కన్న చూపించిన దారిలో వెళుతున్నారనడానికి ఇవే ఉదాహరణలు. బాహుబలి చిరస్మరణీయ విజయం ఎంతమందిలో స్ఫూర్తిని నింపిందో అర్థం చేసుకోవడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్.

ఇక పద్మావత్ లేడీ ఓరియెంటెడ్ అయితే సైరా.. పానిపట్ లాంటివి రాజుల శౌర్యాన్ని ఆవిష్కరించాయి. ఇక ఇదే తరహాలోనే మరో పాన్ ఇండియా మూవీ పృథ్వీరాజ్ తెరకెక్కుతోంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్. తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పాన్ ఇండియా కేటగిరీలో దీపావళికి రిలీజ్ కానుంది.

అసలు ఈ సినిమా కథాంశం ఏమిటి? అంటే.. రాజాధి రాజు.. రాజస్థానీ అయిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవితకథ అని చెబుతున్నారు. 1178-1192 CE కాలంలో వీరు భారతదేశాన్ని పాలించారు. గుజరాతీ అయిన ఆయన అజ్మెర్ (దిల్లీ) కేంద్రంగా పాలన సాగించారు. ఇక రాజస్తాన్ రాజ్ పుత్ లతోనూ అనుబంధం కలిగిన హిందూరాజుగా ఆయన పాపులర్. పృథ్వీరాజ్ ఆయన సతి సన్యోగిత పై రాష్ట్ర ప్రజలకు ఉన్న ప్రేమ.. అపారమైన గౌరవం .. వారి దక్షతపై తీస్తున్న సినిమా. పృథ్వీరాజ్ – సన్యోగిత కథ భారతదేశ సాంస్కృతిక సాంఘిక చరిత్రలో లోతుగా పొందుపరిచి ఉన్న ఓ కథాంశం. ఇక టైటిల్ పాత్రలో కిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తుండగా.. సన్యోగిత పాత్రలో మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ నటిస్తోంది. పలు క్రేజీ అవార్డులు గెలుచుకున్న ‘పింజార్ ‘జీవిత కథల ఆధారంగా టెలివిజన్ ఇతిహాసం ‘చాణక్య’కు దర్శకత్వం వహించిన డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది తాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా గురించి మానుషి మాట్లాడుతూ..”ఇటీవల మేము రాజస్థాన్ లో షూటింగ్ లో పాల్గొన్నాం. అప్పుడు అక్కడ ప్రజలు చాలా ప్రేమను కురిపించారు.వారి మద్దతు ప్రశంసలకు కృతజ్ఞతలు చెప్పలేను. ఆ జ్ఞాపకాన్ని నా హృదయంలో ఎప్పటికీ సజీవంగా ఉంచుతాను” అని ఆనందం వ్యక్తం చేసింది. “పృథ్వీరాజ్ – సన్యోగిత పై వారి హృదయాలలో ఉన్న గౌరవం చాలా ఎక్కువ. తెరపై సన్యోగిత జీవితానికి న్యాయం చేయటం నాకు చాలా పెద్ద బాధ్యత. ఈ దీపావళికి థియేటర్లలో నన్ను చూసినప్పుడు ప్రేక్షకుల్ని సంతృప్తి పరిచేందుకు నా బెస్ట్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను” అని తెలిపింది. మొత్తానికి మరో పాన్ ఇండియా సినిమా బరిలో దిగుతోంది. రాజులు.. రాజ్యాలు.. యుద్ధాలు అంటూ భీకరంగా వెండితెరను వెలిగించేందుకు వస్తోంది. మరి ఏమేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది? అన్నది వేచి చూడాలి.
Please Read Disclaimer