సినిమా ఆఫీస్ అని బెడ్ రూంకు తీసుకు వెళ్లా

0

అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఈమద్య కొంతలో కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. అవకాశాల కోసం ఆశగా ఎదురు చూసే ఆడవారు అమ్మాయిలు కనిపిస్తే చాలు కొందరు వల వేసి మరీ లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అవకాశాల కోసం మనసు చంపుకుంటే మరికొందరు మాత్రం అవసరమే లేదు అనుకునే వారు ఉన్నారు. ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలతో బేరసారాలు.. అందుకు చర్చలు జరపడం చేస్తూ ఉంటారు. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ మాన్వి గాగ్రూ తాను గతంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

కొన్ని సంవత్సరాల క్రితం తాను ఒక సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్లాను. అది ఒక సినిమా ఆఫీస్ మాదిరిగా లేదు. సినిమా ఆఫీస్ లు ఇలా కూడా ఉంటాయా అనిపించింది. అత్యంత చెత్తగా బ్యాచులర్స్ ఉండే రూం మాదిరిగా ఉంది. అక్కడ ఇద్దరే ఇద్దరు ఉన్నారు. వారు తమకు కావాల్సిన నటి రేప్ సీన్ సరిగా చేయగలిగి ఉండాలని నాతో అన్నారు. నేను నటించగలను అని చెప్పాను. కాని వారు అక్కడే రేప్ సీన్ ను చేయమని అన్నారు. పక్కనే ఉన్న బెడ్ ను చూపించి వెళ్లమన్నారు.

అక్కడ పరిస్థితి నాకు అర్థం అయ్యింది. సినిమా ఆడిషన్స్ పేరుతో వారు చేస్తున్న పని ఏంటో నాకు అర్థం అయ్యింది. సినిమా ఆఫీస్ అంటూ చెప్పి మంచం వేసి ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. కాని రేప్ సీన్ ఆడిషన్స్ చేద్దాం అంటూ మంచం చూపించినప్పుడు నాకు పూర్తిగా తెలిసి వచ్చింది. వారి నుండి నేను వెంటనే బయట పడాలనుకున్నాను. వారితో ఏం చెప్పకుండానే బయటకు చాలా స్పీడ్ గా వచ్చేశానంటూ మాన్వి చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ లో చాలా కాలంగా వెబ్ సిరీస్.. టీవీ షోలతో అలరిస్తూ వచ్చిన ఈ అమ్మడు ఉజ్జా చమన్ సినిమాతో హీరోయిన్ గా బ్రేక్ తెచ్చుకుంది. ఈమె కాస్త బరువు తగ్గితే మంచి ఆఫర్లు వస్తాయంటూ బాలీవుడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer