దిగ్బందంలో పలువురు స్టార్స్ ఇళ్లు

0

దేశ వ్యాప్తంగా మహమ్మారి వైరస్ పాజిటివ్ ల సంఖ్య విపరీతంగా పెరిగి పోతూ ఉంది. మొన్నటి వరకు సినీ ప్రముఖులు దీని బారిన పెద్దగా పడినట్లుగా వార్తలు రాలేదు. కాని ఎప్పుడైతే షూటింగ్స్ కు పర్మీషన్ ఇచ్చారో.. ఎప్పుడైతే పరిస్థితులు సాదారణ స్థితికి వచ్చాయో అప్పటి నుండి కూడా సినీ ప్రముఖుల్లో కూడా వైరస్ భయం పట్టుకుంది. సెలబ్రెటీలు పలువురికి వైరస్ నిర్ధారణ పరీక్ష పాజిటివ్ వచ్చింది.

బెంగళూరు సినీ ప్రముఖుల ఇళ్లు దిగ్బందంలోకి వెళ్లి పోయాయి. హీరో సుదీప్ ఉంటున్న ఇంటికి సమీపంలో నివాసం ఉండే ఒక వ్యక్తికి వైరస్ పాజిటివ్ వచ్చింది. అదే గల్లీలో పలువురికి కూడా వైరస్ నిర్థారణ అయినట్లుగా సమాచారం. దాంతో సుదీప్ ఇంటికి వెళ్లే గల్లీని రెండు వైపుల పూర్తిగా క్లోజ్ చేశారు. పూర్తిగా 14 రోజుల పాటు ఇంటి నుండి ఎవరు కూడా బయటకు వెళ్లవద్దంటూ అధికారులు ఆదేశించారు. ఈ విషయాన్ని హీరో సుదీప్ అభిమానులు షేర్ చేశారు.

సుదీప్ తో పాటు నటుడు దర్శన్ మరో నటుడు రవిశంకర్ గౌడ్ ఉంటున్న అపార్ట్ మెంట్స్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా వైరస్ ఆందోళన కలిగిస్తుంది. దర్శన్ భార్య విజయలక్ష్మి కి వైరస్ నిర్థారణ అయినట్లుగా పుకార్లు వచ్చాయి. కాని అది నిజం కాదని వారికి పక్కన ఉండే ప్లాట్ లో ఒక కేసు నిర్థారణ అయ్యిందని కన్నడ సినిమా పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికి కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇప్పుడు దిగ్బందంలో ఉండటంతో పాటు మరికొందరు తమ ఇంట్లోనే వైరస్ నిర్థారణ కావడంతో ఆందోళనలో ఉన్నారట.
Please Read Disclaimer