జాతీయ అవార్డు అందుకున్నాకే పెళ్లి.. కుదిరే పనేనా?

0

అందాల నయనతార.. కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ నుంచి ఆ ‘శుభవార్త’ వినడానికి అంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఏళ్లకు ఏళ్లు ఈ జంట వివాహం గురించి కథనాలొస్తున్నా అధికారిక వార్త మాత్రం రాలేదు. అన్నీ ఊహాగానాలే. ఇంతకుముందు ఆలయంలో రాహుకేతు పూజల కార్యక్రమం తరువాత వారు వివాహం చేసుకుంటారని భావించినా.. COVID-19కి రిలీఫ్ వచ్చాక వివాహం చేసుకుంటారని కథనాలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. నయనతార జాతీయ అవార్డ్ అందుకున్న తరువాతే వారు వివాహం చేసుకుంటారని తెలుస్తోంది.

దీనిపై అధికారిక ధృవీకరణ లేనప్పటికీ అప్పట్లోనే `అరామ్` చిత్రంలో ఆమె చేసిన పాత్రకు నయనతార ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంటుందని అంతా భావించారు.. ఒక పిల్లవాడిని బోర్-బావి నుండి కాపాడటానికి పోరాడే బాధ్యతాయుత కలెక్టర్ గా నయనతార నటించారు. అయితే తన నటనకు అవార్డును గెలుచుకోకపోవడం నిరాశ పరిచింది. లేడీ సూపర్ స్టార్ జాతీయ అవార్డుకు అర్హురాలే అయినా కమిటీ ఎందుకనో ముఖం చాటేసింది.

కెరీర్ సంగతి చూస్తే.. ఆర్జే బాలాజీ `మూకుతి అమ్మన్` లో నటిస్తోంది. రజనీ.. ఖుష్బు సుందర్.. మీనా.. కీర్తి సురేష్ ఇతర ప్రధాన తారాగణం. ఆమె బ్యూ విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన `కాతు వాకులా రెండు కాదల్` అనే చిత్రంలో నూ నటిస్తోంది. ఈ చిత్రంలో కథానాయకుడిగా విజయ్ సేతుపతి నటిస్తుండగా.. సమంత అక్కినేని మరో నాయికగా కనిపించనుంది.