మారుతితో మహేష్ వర్కౌట్ అవుద్దా?

0

ఏదైనా సినిమా హిట్టయినా డైరెక్టర్ కి పెరొచ్చినా మహేష్ కన్ను ఆటో మేటిక్ గా ఆ డైరెక్టర్ పై పడుతుంది. ‘F2’తర్వాత అనిల్ ని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. ఇక ‘గీత గోవిందం’ తర్వాత పరశురాంకి కూడా కథ వినిపించే ఛాన్స్ అందించాడు. వీళ్ళందరినీ పక్కన పెడితే మారుతీ కి కూడా పిలిచి మరీ అడ్వాన్స్ ఇచ్చాడట సూపర్ స్టార్.

భలే భలే మగాడివోయ్ తర్వాత తనను ఇంటికి పిలిచి మరీ అడ్వాన్స్ గా ఒక చెక్ ఇచ్చి కథ రెడీ చేయమని మహేష్ చెప్పాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు మారుతీ. దీంతో ఇప్పుడు మహేష్ -మారుతీ కాంబో తెరపైకి వచ్చింది. మరి భలే భలే మగాడివోయ్ తర్వాత మారుతీ మహేష్ కి ఏదైనా కథ వినిపించాడా..? లేదా స్టార్ హీరోతో ఇప్పుడే అవసరమా అని లైట్ తీసుకున్నాడా తెలియాల్సింది ఉంది.

ఏదేమైనా మారుతీ ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ మినిమం బడ్జెట్ లో ఓ మోస్తరు హీరోలతో చేసినవే. ‘ప్రతి రోజు పండగే’ తో మళ్ళీ ఓ సూపర్ హిట్ అందుకున్నాడు. కానీ మహేష్ మారుతీకి చాన్స్ ఇస్తాడా ..? ఇక మహేష్ లిస్టులో ఇప్పటికే చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. మరి వారిలో ఒకరిని పక్కన పెట్టి మహేష్ మారుతీ చాన్స్ ఇచ్చినా ఈ కాంబో మీద బజ్ రావడం కష్టమే.
Please Read Disclaimer