లక్కీగా హిట్ వచ్చింది ఆపై రేంజ్ రోవర్ కూడా..!

0

సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతి రోజు పండుగే’ చిత్రం గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం భారీగా వచ్చాయి. 17 రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 32 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మొదటి వారం తర్వాత డల్ అవుతుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఈ చిత్రం మూడవ వారం వరకు వసూళ్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

రెండవ వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం లాభాలతో రన్ అవుతుంది. దాంతో నిర్మాతలకు భారీ లాభాలు ఖాతాలో పడుతున్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు జీఏ2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనూహ్యంగా వస్తున్న లాభాలతో నిర్మాతలు ఉబ్బి తబ్బిబవుతున్నారు. తాజాగా యూవీ నిర్మాత వంశీ దర్శకుడు మారుతికి ప్రత్యేకమైన బహుమానంను అందజేశాడు.

తమ బ్యానర్ కు ఒక మంచి సక్సెస్ అందించావు అంటూ రేంజ్ రోవర్ కారును మారుతికి వంశీ బహుమానంగా ఇచ్చాడు. ఆ ఫొటోను మారుతి సోషల్ మీడియాలో షేర్ చేసుకుని తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ ఫొటోను పోస్ట్ చేసి థ్యాంక్స్ వంశీ డార్లింగ్. నీలాంటి స్నేహితుడు ఉంటే ప్రతి రోజు పండుగే అంటూ కామెంట్ పెట్టాడు. ప్రతి రోజు పండుగే చిత్రం సాయి ధరమ్ తేజ్ మరియు రాశిఖన్నాల కెరీర్ లకు కూడా చాలా బూస్ట్ ఇచ్చింది.

మారుతి మరో మెట్టు పైకి ఎక్కేలా చేసింది. సంక్రాంతి సినిమాల జోరు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రేపటి నుండి ప్రతి రోజు పండుగే జోరు కాస్త తగ్గే అవకాశం ఉంది. అయినా కూడా 35 కోట్ల లాంగ్ రన్ కలెక్షన్స్ ను ఈ చిత్రం నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు చెబుతున్నారు.
Please Read Disclaimer