నాని ఆ దర్శకుడికి మళ్ళీ ఛాన్స్ ఇస్తాడా…??

0

నేచురల్ స్టార్ నాని ‘అష్టాచమ్మ’ చిత్రం ద్వారా పరిచయమై తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నటుడు. ‘రైడ్’ ‘స్నేహితుడు”భీమిలీ కబడ్డీ జట్టు’ అలా మొదలైంది చిత్రాల ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన ఏటో వెళ్లిపోయింది మనసు ఈగ మజ్ను నేను లోకల్ ఎంసీఏ గ్యాంగ్ లీడర్ చిత్రాలు నానిని ఒక ప్రత్యేకమైన స్టార్ గా నిలబెట్టాయి. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా మాత్రం ‘భలే భలే మగాడివోయ్’. ఈ సినిమాతోనే నాని మార్కెట్ స్థాయి కూడా పెరిగింది. ఈ చిత్రాన్ని మారుతి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత మారుతి నాని కలిసి మరొక సినిమా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కూడా భావించారు. అందుకు తగ్గట్లుగానే మారుతి నానిలు కూడా మరొసారి కలిసి వర్క్ చేయాలని అనేకసార్లు అనుకున్నారు. కానీ ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. అయితే త్వరలో వీరి కాంబినేషన్ పట్టాలెక్కే సూచనలు కనబడుతున్నాయి. వీరి ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నట్టు ఇటీవలే వార్తలు వచ్చాయి.

ఇదిలావుండగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రతిరోజూ పండగే చిత్ర విజయంతో మంచి ఊపు మీదున్న మారుతి నాని కోసం ఫుల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే ఇంతవరకు రాలేదు. కాకపోతే వీరి కాంబినేషన్ లో సినిమా కచ్చితంగా వస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ‘వి’ చిత్రం చేస్తున్న నాని త్వరలో ‘టక్ జగదీష్’ అనే సినిమాను స్టార్ట్ చేయనున్నారు. విడుదలకు సిద్దంగా వున్న ‘వి’ చిత్రంలో నాని నెగటివ్ రోల్ చేస్తున్నాడని సమాచారం.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-