ప్రతిరోజూ టిక్ టాక్ వీడియోలతో ఏంటీ పని రాశీ?

0

టిక్ టాక్ పర్యవసానం తెలిసిందే. కాపురాలు కూల్చిన టిక్ టాక్! అంటూ నిరంతరం టీవీల్లో గడబిడ చూస్తున్నదే. టిక్ టాక్ వీడియోలతో పెరిగిన పరిచయం ప్రేమగా మారి అది కన్నతల్లినే చంపేంత వరకూ వెళ్లడం ఇటీవల సంచలనమైంది. ప్రియుడి వల్ల ఓ కూతురు కన్నతల్లినే హత్య చేయడం కలకలం రేపింది. హైదరాబాద్ పరిసరాల్లో ఈ ఘటన జరగడంతో ఉలిక్కిపడ్డారంతా. టిక్ టాక్ పరిచయం ఇంత ఘాటుగా ఉంటుందా? అంటూ యూత్ లో ఒకటే డిస్కషన్ నడిచింది. ఇక టిక్ టాక్ వీడియోలు చాలా కాపురాల్లో నిప్పులు పోయడంపైనా నిరంతరం చర్చ సాగుతోంది. ఈ బర్నింగ్ పాయింట్ మారుతి సినిమాకి కీ ఎలిమెంట్ అయ్యిందట.

ఇంతటి హారిబుల్ అనుభవాల్ని ఇస్తున్న టిక్ టాక్ ని నవతరం దర్శకుడు మారుతి తెలివిగా తన సినిమాలో ఉపయోగించుకుంటున్నాడు. సాయిధరమ్ – రాశీ ఖన్నా జంటగా మారుతి తెరకెక్కిస్తున్న ప్రతిరోజు పండగే సినిమాలో టిక్ టాక్ కామెడీ హైలైట్ గా ఉంటుందట. రాశీ ఖన్నా .. ఏంజెలినా అరుణ అనే పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. రోజూ టిక్ టాక్ వీడియోలతో సందడి చేస్తూ హడావుడి చేసే కొంటె అమ్మాయిగా కనిపిస్తుందట. ప్రస్తుతం యువతరానికి సులువుగా కనెక్టయిపోయే రోల్ ఇది.

బర్నింగ్ టాపిక్ ని ఎంచుకుని ట్రెండ్ ని ఫాలో అవ్వడంలో మారుతి తర్వాతనే. గొప్ప క్రియేటివ్ ఐడియాలతో ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్లు ఇవ్వడంలో మారుతి ప్రూవ్ చేసుకున్నాడు. మతిమరుపు కాన్సెప్టుతో భలే భలే మగాడివోయ్ తీసి నానీకి హిట్ ఇచ్చినట్టే ఈసారి టిక్ టాక్ ఐడియాతో సాయిధరమ్ – రాశీ జంటకు అద్భుతమైన హిట్టిస్తాడేమో చూడాలి. టిక్ టాక్ ఎపిసోడ్స్ కేవలం కామెడీ కోసమేనా లేక సందేశం ఇచ్చేందుకా అన్నది మారుతినే చెప్పాలి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home