మార్వెల్ తెస్తున్న పాకిస్తానీ సూపర్ హీరో

0

వినోద ప్రపంచంలో కాల్పానిక పాత్రలను ప్రవేశ పెట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని సూపర్ హీరోలను సృష్టించిపెట్టిన మార్వెల్ స్టూడియోస్ త్వరలో మరిన్ని సంచలనాలకు సిద్ధమవుతోంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ తో తన రేంజ్ ఏమిటో నిరూపించిన ఈ సంస్థ వచ్చే రెండేళ్ల కాలంలో కొత్త కొత్త క్యారెక్టర్లను ఇంట్రోడ్యూస్ చేయబోతోంది. అందులో మొదటగా వస్తున్నది మిస్ మార్వెల్.

పాకిస్తాన్ అమెరికా నేపథ్యం ఉన్న ఓ అమ్మాయి న్యూజెర్సి లో ఉంటూ సూపర్ పవర్ గా ఎలా ఎదిగింది అనే థీమ్ మీద త్వరలో వెబ్ సిరీస్ లు సినిమాలు తీసుకురాబోతున్నట్టు మార్వెల్ ప్రకటించింది నవంబర్ 12న ఈ పాత్ర తాలూకు పరిచయాలు విశేషాలు ఓ గ్రాండ్ ఈవెంట్ ద్వారా ప్రపంచానికి వెల్లడి చేయబోతున్నట్టు చెప్పింది. ఈ మిస్ మార్వెల్ పాత్ర పోషిస్తున్న అమ్మాయి పేరు కమలా ఖాన్. ఆమె జీవితం చుట్టే ప్రమాదాల మధ్య మిస్ మార్వెల్ కథలు ఉంటాయి.

బిష కె అలీ నేతృత్వంలో రూపొందే ఈ ప్రాజెక్ట్ ద్వారా మార్వెల్ కంపెనీ మొదటి ముస్లిం సూపర్ హీరోని పరిచయం చేయబోతోంది. ఇది ఒకరకంగా చెప్పాలంటే రికార్డే. ఇప్పటిదాకా హిందూ అని ఎలాంటి హీరోను సృష్టించని మార్వెల్ ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా ముస్లిం హీరో అని కమ్యూనిటీ పరంగా దీనికి పూనుకోవడం విచిత్రమే. కారణం ఏదైనా మార్వెల్ చాలా చాలా కొత్త హీరోలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటి మరియు రేపటి తరం పిల్లల కోసం విశేషమైన అనుభూతులు ఖాయమని చెబుతోంది.
Please Read Disclaimer