మాస్ మహారాజ్ వర్సెస్ పందెంకోడి

0

మాస్ మహా రాజా రవితేజ కథనాయకుడి గా ఆయన 66వ చిత్రం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్య క్రమాల తో మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇందులో రవితేజ సరసన శృతి హాసన్ కథానాయిక గా నటించనుంది. సముథి రఖని కీలక పాత్ర పోషిస్తున్నాడు. గోపీ చంద్ మలినేని తొలిసారి తన శైలికి భిన్నంగా వెళ్లి చేస్తున్న చిత్రమిది.

వాస్తవ సంఘటనలకు తనదైన క్రియేటివిటీ నీ కమర్షియల్ హంగుల్ని అద్ది తెరకకెక్కిస్తోన్న చిత్రం కావడంతో రవితేజ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో తనదైన మార్క్ కామెడీ.. యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రం లో ఓ లేడీ విలన్ చేసే హంగామా మామూలుగా ఉండదట.

ఇంతకీ ఎవరు ఆ లేడీ విలన్ అని అరాతీస్తే.. పందెంకోడి వరలక్ష్మి శరత్ కుమార్ ని బరిలో దించుతున్నారని తెలుస్తోంది. వరలక్ష్మి అంటేనే రెబల్. పందెకొండి చిత్రంలో ఎంతో రఫ్ గా ఉండే పాత్రలో నటిస్తోందా అంటూ సోషల్ డియాని కథనాలు వేడెక్కిస్తున్నాయి. మాస్ రాజా లాంటోడి కి ప్రతి నాయికగా వరలక్ష్మిని సెట్ చేస్తే ఆ కాంబినేషన్ అదిరి పోతుందని అభిమానులు భావిస్తున్నారు. గతం లో వర లక్ష్మి పందెం కోడి సహా దళపతి నటించిన మెర్సల్ లోనూ పవర్ ఫుల్ యాక్షన్ తో అదరగొట్టింది. ప్రతి నాయిక పాత్రలో ఒదిగిపోయి నటించింది వరూ. ఆ రెండు చిత్రాలు వరలక్ష్మి కి కోలీవుడ్ సహా టాలీవుడ్ లో నటిగా మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యం లో రవితేజ సినిమా లో విలనీ చేయబోతోందా..? అసలు ఎలాంటి పాత్ర లో నటించనుంది అన్న ఆసక్తి నెలకొంది.
Please Read Disclaimer