థియేటర్స్ తెరుచుకోవడంతో భారీగా తరలి వస్తున్న ప్రేక్షకులు…!

0

ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా మహమ్మారి చేతిలో చిక్కి విలవిలలాడిపోతోంది. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలపై పడింది. ఈ మహమ్మారి ఎఫెక్ట్ ఎక్కువగా పడిన రంగాలలో సినీరంగం ఒకటి. దీని వలన గత రెండున్నర నెలలుగా సినిమా షూటింగులు ఆగిపోయాయి. థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతబడి ఉన్నాయి. దీంతో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఈ మధ్య కొన్ని దేశాల్లో నిబంధనలు సడలిస్తూ వస్తున్నారు. అక్కడక్కడ థియేటర్స్ కూడా రీ ఓపెన్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఫ్రాన్స్ లో కూడా థియేటర్స్ ఓపెన్ చేసుకోడానికి అనుమతిచ్చారు.కరోనా మహమ్మారి యూరప్ దేశాలను ఎలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ మధ్య కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో ఫ్రాన్స్ లో ఆంక్షలు సడలించడంతో ప్రజలు యధావిధిగా బయటకు వస్తూ ఎప్పటిలాగే పనులు చేసుకుంటున్నారు. దాదాపుగా అంతా కంట్రోల్ ఉందని భావించిన ప్రభుత్వం అక్కడ సినిమా థియేటర్లు కూడా రీ ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో నిన్నటి నుంచి అక్కడ థియేటర్లు ఓపెన్ అయ్యాయి. భౌతిక దూరం పాటిస్తూ ప్రతి రెండు సీట్లకు మధ్య గ్యాప్ ఉండేలా మధ్యలో మినియన్స్ బొమ్మలను ఏర్పాటు చేశారు.

దాదాపుగా 80 రోజుల తరువాత థియేటర్లు ఓపెన్ కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్స్ కి తరలివస్తున్నారు. బస్సుల్లో రైళ్లలో ప్రయాణం కంటే రెండు గంటల పాటు థియేటర్లో కూర్చోవడం పెద్ద రిస్క్ కాదని అక్కడి ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. మరి ఫ్రాన్స్ వారు పాటించిన సీటింగ్ సిస్టమ్ ఫాలో అయ్యి మనదేశంలో కూడా థియేటర్స్ రీ ఓపెన్ చేస్తారేమో చూడాలి.
Please Read Disclaimer