మత్తు వదలరా టీజర్ టాక్

0

అతినిద్ర ముప్పు అంతా ఇంతా కాదు. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఆ మత్తు వదిలించడం అంత సులువేమీ కాదు. కూచున్నచోట… నిలుచున్నా కూడా నిదురొచ్చేస్తుంది ఈ రోగం వల్ల. మరికొందరు నిదురించిన చోటి నుంచి కదిలే ఛాన్సే ఉండదు. నేలపై బార్లా పడినా అక్కడిక్కడే నిద్రించగలరు. ఇలాంటి మత్తు వల్ల రెగ్యులర్ వ్యాపకాల్లో నానా అగచాట్లు తప్పదు. కోపం-చికాకు అతినిద్రతో ముడిపడినవి కావడంతో ఏది చేయాలన్నా.. ప్రతిదీ చికాగ్గేనే ఉంటుంది. ఎదుటివారికి అది ఇర్రిటేషన్ తెప్పిస్తుంది కూడా.

అయితే ఇదే కాన్సెప్టుతో సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన సినిమానే `మత్తు వదలరా`. తాజాగా రిలీజైన టీజర్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది. టీజర్ ఆద్యంతం అతినిద్ర పర్యవసానాల్ని అద్భుతంగా ఎలివేట్ చేశారు. ఈ సినిమాతో మరకతమణి ఎం.ఎం.కీరవాణి తనయుల కెరీర్ ముడిపడి ఉంది. కీరవానికి చిన్న కుమారుడు శ్రీసింహా కథానాయకుడిగా పరిచయం అవుతుండగా ఇదే చిత్రంతో పెద్ద కుమారుడు భైరవ సంగీత దర్శకుడిగా లక్ చెక్ చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకి ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఎన్టీఆర్ లాంచ్ చేయగా.. టీజర్ ని రామ్ చరణ్ రిలీజ్ చేశారు.

అతినిద్ర యొక్క లక్షణాలు.. అలుపు-ఆయాసం-ఆగ్రహం-ఆరాటం-మతి భ్రమణం.. అంటూ ఆ లక్షణాలతోనే సినిమా కథ మొత్తం రివీలైంది. ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. డెబ్యూ హీరోనే కాబట్టి శ్రీసింహా తనని తాను నిరూపించుకునేందుకు చాలానే హార్డ్ వర్క్ చేశాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఎంచుకున్న కాన్సెప్ట్ ఓకే. టీజర్.. ఫస్ట్ లుక్ ఓకే.. టీజర్ విషయంలో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి టిప్స్ వర్కవుటైనట్టే కనిపిస్తోంది. కీరవాణి-రాజమౌళి ద్వయం ఈ సినిమాపై ప్రాణం పెట్టేస్తారనడంలో సందేహం లేదు. అయితే ఎంత చేసినా.. ఎవరేం చేసినా హిట్టును నమ్మే పరిశ్రమలో బాక్సాఫీస్ బరిలో నిరూపించుకోవడం చాలా ఇంపార్టెంట్.
Please Read Disclaimer