సూపర్ స్టార్ కు మీటూ సెగ

0

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొంత కాలంగా సక్సెస్ లు లేక ఇబ్బందులు పడుతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘జీరో’ చిత్రం షారుఖ్ ను మరింత కిందకు దిగజార్చింది. దాంతో తీవ్ర నిరుత్సాహంలో పడిపోయిన షారుఖ్ ఖాన్ ఎట్టకేలకు కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే. బాలీవుడ్ లో పలు అద్బుత చిత్రాలను తెరకెక్కించి ఇటీవలే ప్రపంచ దిగ్గజ దర్శకుల జాబితాలో టాప్ ప్లేస్ ను దక్కించుకున్న రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సినిమాను చేయబోతున్నాడు. ఈ ప్రకటన వెలువడినప్పటి నుండి కూడా షారుఖ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.

దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఒక మహిళ రాజ్ కుమార్ హిరానీ తనను లైంగికంగా వేదించాడంటూ కొన్ని రోజుల క్రితం ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. బాలీవుడ్ పెద్దలు ఆమద్య మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బహిష్కరించాలనే అనధికారిక నిర్ణయానికి వచ్చారు. అలా చాలా మందిని ఇండస్ట్రీకి దూరం పెట్టడం జరిగింది. కాని షారుఖ్ మాత్రం మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్దం అవ్వడంతో ఆయనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పలువురు స్టార్స్ గతంలో మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న టెక్నీషియన్స్ ను తమ సినిమాల నుండి తొలగించడం జరిగింది. కాని షారుఖ్ మాత్రం ఏరి కోరి ఆయన దర్శకత్వంలో సినిమా చేయండం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. మరో వైపు షారుఖ్ అభిమానులు మాత్రం హిరానీపై సదరు మహిళ చేసిన ఆరోపణలు నిరాధారం అని.. అందుకే ఆయనతో సినిమాకు షారుఖ్ సిద్దమవుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ విమర్శలపై షారుఖ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Please Read Disclaimer