మెగా మల్టీస్టారర్ .. ఇంతలోనే ట్విస్టు

0

తేజ్ వర్సెస్ తేజ్.. కాంబినేషన్ సెట్టవుతోందా? ఇంతలోనే ఏమిటో ఈ ట్విస్టు? అయితే ఇందుకు ఆస్కారం లేకపోలేదని తాజా సన్నివేశం చెబుతోంది. మెగా హీరోలు వరుణ్ తేజ్- మెగా మేనల్లుడు సాయిధరమ్ కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. ఇద్దరు మెగా హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుణ్ కమర్శియల్ ఇమేజ్ తో పాటు డిఫరెంట్ జానర్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆవిషయంలో సాయి తేజ్ కన్నా వరుణ్ ఓ మెట్టు పైనే ఉన్నాడు.

కొన్ని పరాజయాల తర్వాత సాయి తేజ్ కెరీర్ ను ఇటీవలే చిత్రలహరి సక్సెస్ తో ట్రాక్ లోకి తెచ్చారు. ప్రస్తుతం కథలపై కేరింగ్ ఎక్కువైంది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా సాయి తేజ్ జాగ్రత్తపడుతున్నాడు. కెరీర్ ను పర్ పెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతీ రోజు పండగే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సుబ్బు అనే కొత్త కుర్రాడిని పరిచయం చేస్తూ.. సోలో బ్రతుకే సో బెటర్ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు.

ఇక వరణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బాబాయ్ పవన్ కళ్యాణ్ జానీ స్ఫూర్తితో ఈ సినిమా తీస్తున్నట్లు ప్రచారంలోకి రావడంతో సినిమాపై బజ్ పెరుగుతోంది. పవన్ వ్యక్తిత్వాన్ని పాక్షికంగా టచ్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక పోతే ఇటీవలే సాయితేజ్.. వరుణ్ తేజ్ ఇద్దరితో సినిమాలు చేస్తానని బాస్ అల్లు అరవింద్ ప్రకటించారు. అయితే ఇంతలోనే మరో అప్ డేట్ మెగా ఫ్యాన్స్ ని హీటెక్కిస్తోంది.

తాజాగా తేజ్ – తేజ్ కాంబినేషన్ అంటూ మరో కొత్త ప్రచారం వేడెక్కిస్తోంది. సాయి తేజ్- వరుణ్ తేజ్ కాంబినేషన్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. వరుణ్-సాయిధరమ్ లు ఒకేతాటిపై తీసుకొచ్చి అల్లు అరవింద్ ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారుట. ప్రస్తుతం ఇద్దరి ఇమేజ్ లకు సరితూగే స్క్రిప్ట్ కోసం అన్వేషణ చేస్తున్నారని సమాచారం. ఖాళీ సమయాన్ని వీళ్లిద్దరి కోసమే కేటాయిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడెవరు? ఇందులో నిజమెంతన్నది తేలాలంటే అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
Please Read Disclaimer