కరోనాను క్యాష్ చేసుకుంటున్న మీడియేటర్లు!

0

ఒక అంశానికి ఎప్పుడూ రెండు పార్శ్వాలు ఉంటాయి. ఒక వైపే చూసి అదే నిజం.. అదొక్కటే వాస్తవం అని బల్లగుద్ది చెప్తే రెండో వైపు లేకుండా పోదు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూ ఉండడంతో థియేటర్లు మూత పడ్డాయి. సినిమా షూటింగులకు బ్రేక్ పడింది. టాలీవుడ్ లో ఒక్కసారిగా స్థంబించింది. హీరోలు ఓ వైపు కొత్త కథలు వింటూ.. మరోవైపు కుటుంబంతో కాలం గడుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది నాణేనికి ఒక కోణం. పాజిటివ్ యాంగిల్.

ఇంకో కోణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఇతర శాఖల్లో పని చేసే వారి తరహాలోనే మీడియేటర్లకు ఇప్పుడు పనిలేకుండా పోయింది. షూటింగ్ ఉంటే ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించుకునేవారు ఇప్పుడు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. దీంతో వీరిలో కొంతమంది సినిమా పనిలేక ఖాళీగా ఉంటూ ‘ఆ పని’ తెలిసిన అందగత్తెలకు టచ్ లో ఉన్నారట. వారి ఫోటోలను సినిమా ఇండస్ట్రీలోని..ఇండస్ట్రీతో టచ్ లో ఉండే సరసులకు.. రసికులకు.. కళాపోషకులకు ఫార్వార్డ్ చేసి.. రెండు పార్టీల మధ్య హాటు మీటింగులు.. డేటింగులు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పథకం చేపట్టారట.

కరోనా ఎంత తీవ్రంగా విరుచుకుపడినప్పటికీ ఈ బిజినెస్ మాత్రం ఆగేలా లేదని. మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లడం ఖాయమని అంటున్నారు. అయినా ప్రతికూల పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బు సంపాదించడం సాధారణం కాదు. ఐఐఎం లలో వీరి చేత పెద్ద మేనేజ్మెంట్ స్పీచులు ఇప్పించాలి!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-