మీకు మాత్రమే చెప్తా.. ఓవర్సీస్ దెబ్బ పడిందే!

0

విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిన ‘మీకు మాత్రమే చెప్తా’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. షామీర్ సుల్తాన్ రూపొందించిన ఈ యూత్ సెంట్రిక్ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. రివ్యూస్ లో కూడా షార్ట్ ఫిలిం సబ్జెక్ట్ తో సినిమాను తెరకెక్కించారనే అభిప్రాయం వ్యక్తం అయింది.

ఓవర్సీస్ లో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందంటే.. ఆడియన్స్ పెద్దగా ఇంట్రస్ట్ చూపలేదు అని చెప్పాల్సి ఉంటుంది. ఈమధ్య ఓవర్సీస్ లో తెలుగు సినిమాలకు కలెక్షన్ రావడం లేదు. పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకూ ఒకటే రిజల్ట్ ఉంటోంది. అయితే ప్రోమోస్ ఇంట్రెస్టింగ్ గా ఉండడం.. విజయ్ క్రేజ్ కలిసి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉండొచ్చని భావించారు. ఈ సినిమాను ఓవర్సీస్ లో 80 లక్షలకు అమ్మారట. కానీ ఇప్పటి వరకూ వచ్చిన కలెక్షన్స్ $28K మాత్రమే. వీకెండ్ లోనే ఈ ఫిగర్స్ అయితే వీక్ డేస్ నంబర్స్ ఎలా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ఈ కలెక్షన్ కు బయ్యర్ పెట్టిన థియేటర్ రెంట్.. పబ్లిసిటీ ఖర్చులు కూడా తిరిగి వచ్చేలా లేవట.

ఇంత తక్కువ ధరకు డీల్ సెట్ చేసుకున్నా ఓవర్సీస్ బయ్యర్ కు నష్టం వచ్చే పరిస్థితి ఉండడం అందరికీ షాక్ ఇస్తోంది. దీన్ని బట్టి ఓవర్సీస్ మార్కెట్ ఎంత దెబ్బ తిన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సినిమా బయ్యర్ ను రౌడీ హీరో ఆదుకునేందుకు ముందుకువస్తాడా లేదా వేచి చూడాలి.
Please Read Disclaimer