మీకు మాత్రమే చెప్తాకు మంచి ఛాన్స్ !

0

‘పెళ్ళిచూపులు’ సినిమాతో డైరెక్టర్ గా ప్రేక్షకులను మెప్పించి.. యువ హీరో విజయ్ దేవరకొండకు ఫస్ట్ సోలో హిట్ అందించిన తరుణ్ భాస్కర్ ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. నూతన దర్శకుడు షామిర్ సుల్తాన్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

లిమిటెడ్ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ టార్గెట్ అయితే లేదు. పైగా ఈ సినిమాకు విజయ్ దేవరకొండ ఇప్పటికే సేఫ్ జోన్ లోకి వచ్చాడని కూడా అంటున్నారు. ఇక సినిమా విషయం చూసుకుంటే యూత్ కు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమా విజయంపై మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చెడు అలవాట్లేవీ లేవని హీరోయిన్ ను నమ్మించి వివాహానికి రెడీ అయిన హీరోకు జస్ట్ పెళ్ళికి ముందే ఒక సమస్య ఎదురవుతుంది. హీరో ఒక కసక్కుకు ఫ్రీక్వెన్సీ కనెక్ట్ చేసిన ఫసక్ వీడియో సోషల్ మీడియాలోకి లీక్ కావడంతో ఇబ్బందుల్లో పడతాడు. అందరి చేతిలో హెచ్ డీ కెమెరాలు ఉండే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. సెల్ఫీలు పాత ట్రెండు.. రొమాన్సు వీడియోలు సెల్ఫ్ రికార్డు చేసుకోవడం కొత్త ట్రెండ్ కదా.. సో.. ఈ కాన్సెప్ట్ యూత్ (తమను తాము యూత్ అనుకునే సీనియర్ సిటిజెన్లు కాదు) కు తప్పనిసరిగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రోమో వీడియోస్ లో తరుణ్ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది కాబట్టి టార్గెట్ ఆడియన్స్ ను మెప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

పోటీలో రిలీజ్ అయ్యే సినిమాలతో పోలిస్తే ‘మీకు మాత్రమే చెప్తా’ కు బజ్ ఎక్కువగా ఉంది. ఇక ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాల్లో సత్తా చాటుతున్నది కార్తి ‘ఖైది’ ఒక్కటే. ఈ లెక్కన ‘మీకు మాత్రమే చెప్తా’లో ఎంటర్టైన్మెంట్ ఉంటే బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలవడం ఖాయమే.
Please Read Disclaimer