‘మీకు మాత్రమే చెప్తా’ సెన్సార్ రిపోర్ట్

0

హీరోగానే కాదు నిర్మాతగానూ సత్తా చాటేందుకు విజయ్ దేవరకొండ తొలి ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. స్నేహితుడు తరుణ్ భాస్కర్ ని హీరోని చేస్తూ రుణం తీర్చుకుంటున్నాడు. సొంత నిర్మాణ సంస్థ `కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్ లైన్ మెంట్ పతాకంపై రూపొందిన `మీకు మాత్రమే చెప్తా` రిలీజ్ కి రెడీ అవుతోంది. నవంబర్ 1న మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజాగా ఈ సినిమాకి సెన్సార్ పూర్తయింది. ఈ మూవీ కి ఎలాంటి కట్స్ లేకుండా యుఏ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ అనంతరం చిత్రబృందానికి ప్రశంసలు దక్కాయని చిత్రయూనిట్ తెలిపారు. న్యూఎజ్ ఫన్ ఎంటర్ టైనర్ గా రూపోందిన సినిమా ఇది. నిర్మాతగా విజయ్ చేసిన క్రియేటివ్ ప్రమోషన్స్ తో రిలీజ్ కు ముందు పరిశ్రమలో అటెన్షన్ ని క్రియేట్ చేసింది. టీజర్ ట్రైలర్ తో పాటు విజయదేవరకొండ చేసిన ప్రోమోషనల్ వీడియో సాంగ్ `నువ్వే హీరో`కు మంచి స్పందన వచ్చిందని చిత్రబృందం చెబుతోంది.

ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని .. విజయ్ ప్రోత్సాహంతోనే తాను హీరో అయ్యానని తరుణ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్ టైనర్ గా అందరినీ అలరిస్తుందని అన్నారు. మరో మూడు రోజుల్లోనే థియేటర్లలోకి రాబోతోంది ఈ చిత్రం. తరుణ్ నటన ఎలా ఉంది అన్నది తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.
Please Read Disclaimer